Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: నాలాల సమీపంలోని నివాసేతర భవనాలను హైడ్రా కూల్చివేత!

Hydraa: హైదరాబాద్ మహానగరంలో ఇటీవల తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావటంతో పలు ప్రాంతాలు ముంపునకు గురి కావటంతో జీహెచ్ఎంసీ(GHMC) మరో సారి వరద నివారణపై దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని కోర్ సిటీలో నిజాం కాలంలో నిర్మించిన వరద నీటి కాలువలు, నాలాలు గంట వ్యవధిలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే తట్టుకునే సామర్థ్యం ఉండగా, ఇటీవల నగరంలో గంటకు 20 సెంటీమీటర్ల వర్షం కురిసి, నగరం అతలాకుతలం కావటంతో పాటు కొద్ది రోజుల క్రితం జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్(Usman Sagar), హిమాయత్ సాగర్(Himayathsagar) ల ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు రావటంతో రెండు జలాశయాల నుంచి రికార్డు స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయటంతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించి పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లు, ఎంజీబీఎస్(MGBS) జలమయమైన ఘటనతో వరదల నివారణలో భాగంగా హైదరాబాద్ నగరంలోని నాలాల పక్కనున్న నివాసేతర భవనాలను నేలమట్టం చేసి, నాలాలను విస్తరించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఇందుకు గాను నివాసేతర భవనాలను కూల్చే విషయంపై సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

మూసీ నది పునరుజ్జీవం

నాలాల పక్కనే ఎవరూ నివసించకుండా ఉన్న కట్టడాలు, కమర్షియల్ గా వినియోగిస్తున్న షెడ్డులు, గోదాములు వంటివి కూల్చేసి నాలాలను విస్తరించుకుంటే కొంత వరకు వరదల తీవ్రత తగ్గుతుందన్న ప్రతిపాదనలు జీహెచ్ఎం(GHMC)సీ సర్కారుకు పంపింది. సర్కారు క్లియరెన్స్ ఇవ్వగానే క్షేత్ర స్థాయిలో నివాసేతర భవనాల కూల్చివేతల పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. వరదల నివారణ, మూసీ నది పునరుజ్జీవం అంశాలపై ఇటీవలే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో 370 కి.మీల పొడువున మేజర్ నాలాలు, మరో 1250 కి.మీల పొడువున వరద నీటి కాలువలున్నాయి. ఆక్రమణల కారణంగా ఈ నాలాలు, వరద నీటి కాలువలు కుదించుకుపోవటంతో చిన్న పాటి వర్షానికే నాలాల పక్కనున్న కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో నగరంలో పరిస్థి తులు మరింత దారుణంగా మారటంతో ఇలాంటి పరిస్థితులకు చెక్ చెక్‌పెట్టేందుకు హెచ్‌ సిటీ కార్యక్రమంలో భాగంగానే స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్‌డీపీ) ద్వారా నాలాల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనికి సమాంతరంగా ఆక్రమణల తొలగింపులు చేపట్టాలన్నది సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.

Also Read: ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు

ఆక్రమణలు మొత్తం 12 వేలు

జీహెచ్ఎంసీ పరిధిలోని చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు, వరద నీటి కాలువలపై మొత్తం 12 వేల ఆక్రమణలున్నట్లు ఇదివరకే జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 35 శాతం వరకు నివాసేతర నిర్మాణాలున్నట్లు, నాలాలకు అడ్డంగా రెండు, మూడంతస్తుల భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. కొన్నిచోట్ల 30 అడుగుల వెడల్పు ఉన్న నాలాలు ఆక్రమణల కారణంగా పది అడుగులకు కుదించుకుపోయాయి. ఇంకొన్ని చోట్ల నాలాలు రెండు, మూడు అడుగుల కంటే ఎక్కువ వెడల్పు లేకపోవడంతో వరద నీరు మురుగు నీటితో కలిసి లోతట్టు ప్రాంతాల్లోకి, నాలా పక్కనేనున్న ఇండ్లలోకి ప్రవహిస్తుంది. నాలాల సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు అవసరమని గతంలో ప్రణాళికలు రూపొందించారు. అప్ప‌టి సీఎం కేసీఆర్ కూడా 2020 వరదల సమయంలో ఇదే విష‌యాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాతే ఎస్ఎప్ డీపీని తెరపైకి తెచ్చి, మొదటి దశను అమలు చేశారు.

కేవ‌లం నివాసేత‌ర భ‌వ‌నాలే ఎందుకంటే..

మూసీ చుట్టూగానీ, ఇత‌ర ప్రాంతాల్లో గానీ కేవ‌లం నివాసేత‌ర భ‌వ‌నాల‌ను మాత్ర‌మే తొల‌గించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. నివాసేతర భవనాలు ముందుగా తొలగిస్తే పునరావాసం కల్పించాల్సిన అవకాశం లేకపోవటం, తొలగింపుకు ఎలాంటి అడ్డుంలు ఎదురయ్యే అవకాశం లేనందున మొదటి దశగా సర్కారు వీటిపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. మ‌రోవైపు సివాసేత‌ర భ‌వ‌నాల‌ను ముందుగా తొల‌గిస్తే, త‌ర్వాత అక్ర‌మంగా నిర్మించి నాలాల‌పై ఉన్న ఇత‌ర భ‌వ‌నాల‌ను స‌మ‌యానుకూలంగా తొల‌గించ‌డం సుల‌భ‌వుతుందని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో ఆక్రమణల ఫిర్యాదుల పరిష్కారంలో ఆశించిన ఫలితాలను సాధిస్తున్న హైడ్రాకే నివాసేతర భవనాల తొలగింపు బాధ్యతలను అప్పగించే అవకాశమున్నట్లు తెలిసింది.

Also Read: DA increase 2025: దసరాకి ఒక్క రోజు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Just In

01

Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’ .. తేజ సజ్జా సరికొత్త రికార్డ్!

Vilaya Thandavam: ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అదిరింది

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి సాంగ్.. సోనాక్షి సిన్హా అరిపించేసిందిగా!