Ind Vs Pak Final: ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో (Ind Vs Pak Final) పాకిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించడంతో ప్రత్యర్థి పాకిస్థాన్ 19.1 ఓవర్లు మాత్రమే ఆడి 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో, భారత విజయ లక్ష్యంగా 147 పరుగులుగా ఖరారైంది.
అదరగొట్టిన స్పిన్నర్లు
భారత బౌలర్లలో అత్యధికంగా కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లు కుల్దీప్ 30 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీశారు. చివరిలో జస్పీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.
ఆరంభం అదుర్స్.. ఆ తర్వాత పేకమేడ
పాకిస్థాన్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ జమాన్ తొలి వికెట్‌కు ఏకంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ కలిసి రన్‌రేట్‌ను చూస్తుండగానే బాగా పెంచేశారు. ఈ క్రమంలో ఫర్హాన్ అర్ధ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో, పాకిస్థాన్ భారీ స్కోరు సాధించడం ఖాయమని అనిపించింది. కానీ, 9.4 ఓవర్ల వద్ద తొలి వికెట్‌గా ఫర్హాన్ ఔట్ అయిన తర్వాత మ్యాచ్‌లో సీన్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడ్డాయి. కేవలం 62 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లు పడ్డాయి.
Read Also- Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి
పాక్ బ్యాటర్ల స్కోర్లు ఇవే..
సాహిబ్జాదా ఫర్హాన్(57), ఫఖర్ జమాన్ (46), సైమ్ అయూబ్(14), సల్మాన్ అఘా (8), హుస్సేన్ తలత్ (1), మొహమ్మద్ హారిస్ (0), మొహమ్మద్ నవాజ్ (6), ఫహీం అశ్రఫ్(0), షాహీన్ అఫ్రీది(0), హారిస్ రౌఫ్(6), అబ్రార్ అహ్మద్(1, నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
Ind Vs Pak Final: అదరగొట్టిన బౌలర్లు.. పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్!
పాక్ బ్యాటర్ల స్కోర్లు ఇవే..
సాహిబ్జాదా ఫర్హాన్(57), ఫఖర్ జమాన్ (46), సైమ్ అయూబ్(14), సల్మాన్ అఘా (8), హుస్సేన్ తలత్ (1), మొహమ్మద్ హారిస్ (0), మొహమ్మద్ నవాజ్ (6), ఫహీం అశ్రఫ్(0), షాహీన్ అఫ్రీది(0), హారిస్ రౌఫ్(6), అబ్రార్ అహ్మద్(1, నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.