Ind-Pak-Final-Toss
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

Ind-Pak Toss Update: ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఈ తుది పోరులో టాస్ పడింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాయాది దేశం పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు ఇవే

భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా ( కెప్టెన్), హుస్సేన్ తలత్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అశ్రఫ్, షాహీన్ అఫ్రీది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

Read Also- Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

టీమిండియాలో 2 మార్పులు

ఫైనల్ మ్యాచ్‌‌లో టీమిండియా కీలకమైన మార్పులు చేసింది. శ్రీలంకపై విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే జట్టులోకి వచ్చారు. కాగా, హార్ధిక్ పాండ్యా గాయపడడంతో అతడి స్థానంలో ఫినిషర్ రింకూ సింగ్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ‘‘ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. పిచ్ బాగుంది. గత మ్యాచ్‌లో మేము ఫస్ట్ బ్యాటింగ్ చేశాం. కానీ, నేటి మ్యాచ్‌లో ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. గ్రౌండ్స్ మెన్ పిచ్ కోసం అద్భుతంగా పని చేశారు. గత 5-6 మ్యాచ్‌లలో మేము ఆడిన క్రికెట్ శైలి చాలా మంచి స్థాయిలో ఉంది. దానినీ కొనసాగించాలనుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ, హర్దిక్ చిన్న గాయం కారణంగా ఆడడం లేదు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్‌లో లేరు. బుమ్రా, దూబే, రింకూ సింగ్ జట్టులోకి వచ్చారు’’ అని వెల్లడించాడు.

Read Also- Ind Vs Pak Final: భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అభిషేక్ శర్మ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఫస్ట్ బ్యాటింగ్‌పై సంతోషం: పాక్ కెప్టెన్

టాస్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ, ‘‘ఫస్ట్ బ్యాటింగ్ చేయనుండడం సంతోషంగా ఉంది. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు మేము పరిపూర్ణంగా ఆడలేకపోయాం. కానీ ఇవాళ పర్‌ఫెక్ట్‌గా ఆడాలని అనుకుంటున్నాం. ఒకే తరహా పిచ్‌పై ఆడుతున్నాం, పిచ్ కూడా చెక్కు చెదరకుండా ఉంది’’ అని చెప్పాడు.

కాగా, లీగ్ దశ, సూపర్-4 దశ మాదిరిగానే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కరచాలనం చేసుకోలేదు.

Just In

01

Janagama: మూడు సీట్లు..! ఆరు నోట్లు..! స్థానిక ఎన్నిక‌ల‌పై బెట్టింగ్‌ల జోరు

Bathukamma Kunta: బతుకమ్మకుంట ప్రారంభం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana Education: విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్.. ప్రతి క్లాసుకు 2 కాపీల చొప్పున పంపిణీ

Deepa Mehta: బాలీవుడ్ స్టార్ యాక్టర్ మొదటి భార్య దీపా మెహతా కన్నుమూత

Telangana Intermediate Board: ఇక పై ఇంటర్ లో ఏఐ కోర్సు..