Boy-News
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Crime News: మధ్యప్రదేశ్‌లో దారుణం.. కన్నతల్లిముందు ఐదేళ్ల బాలుడి హత్య

Crime News: మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో అత్యంత అమానుష ఘటన (Crime News) జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి చేతిలో ఐదేళ్ల వయసున్న ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ దారుణం బాలుడి కన్నతల్లిముందే జరిగింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి పేరు మహేష్ అని, అతడి వయసు 25 ఏళ్లు అని స్థానికులు తెలిపారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తల్లి ముందే ఈ దుర్ఘటన జరగడం హృదయవిదారకంగా మారింది. మహేష్ బైక్‌పై వచ్చి, కాలూ సింగ్ అనే స్థానిక నివాసి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు అపరిచితుడు కావడంతో ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతూ చూస్తుండగానే, ఇంట్లోనే ఉన్న పదునైన పార (spade) తీసుకొని బాలుడిపై దాడికి పాల్పడ్డాడు.

Read Also- CM Revanth Reddy: మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది.. వ్యసనాలకు బానిస కావొద్దు.. సీఎం స్వీట్ వార్నింగ్!

ఈ దాడిలో బాలుడి శరీరం నుంచి మెడ విడిపోయిందని సమాచారం. శరీరంపై బలమైన గాయాలు అయ్యాయని స్థానికులు చెప్పారు. వికాస్‌ను రక్షించేందుకు తల్లి ప్రయత్నించినప్పటికీ ఆమె వల్ల కాలేదు. ఆమెకు కూడా గాయాలయ్యాయి. షాక్‌కు గురైన ఆమె అరుపులు విని చుట్టుపక్కలవారు వెళ్లి చూడగా అప్పటికే బాలుడు చనిపోయాడు. గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసుల బృందం ఘటనాస్థలానికి చేరుకోగా, నిందితుడు మహేష్‌ను వారికి అప్పగించారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

Read Also- Kothagudem Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎస్పీ కీలక సూచనలు

ఎస్పీ ప్రెస్‌మీట్

ఈ దారుణ ఘటనపై ధార్ జిల్లా ఎస్పీ మయాంక్ అవస్థి స్పందించారు. ఈ దుర్ఘటన అత్యంత హృదయవిదారకమైనదని వ్యాఖ్యానించారు. నిందితుడు మహేష్‌ను గ్రామస్థులు తీవ్రంగా కొట్టారని, అతడిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని ఎస్పీ వివరించారు. నిందితడు మానసిక పరిస్థితి సరిగా లేకపోవచ్చని అనుమానిస్తున్నట్టు చెప్పారు. నిందితుడు మృతికి అసలైన కారణం ఏంటనేది పోస్ట్‌మార్టం తర్వాతనే తెలుస్తుందని మయాంగ్ అగస్థి చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అయితే, నిందితుడు మానసిక స్థితి సరిగా లేదనిపిస్తోందని అన్నాడు. నిందితుడిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, అతడి మృతిపై న్యాయ విచారణ (judicial inquiry) ప్రారంభమైందని మీడియాకు వెల్లడించారు.

నిందితుడు మహేష్‌ అలిరాజ్‌పూర్ జిల్లాలోని జోబట్ బాగ్డీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. మహేష్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ, గత 3–4 రోజులుగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని వెల్లడించారు. కాగా, ఈ దారుణ ఘటనకు గంట ముందు, అక్కడికి సమీపంలోని ఒక దుకాణంలో వస్తువులు దొంగిలించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులొ పోలీసులు గుర్తించారు.

Read Also- VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

Just In

01

R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

Petal Gahlot: ఐరాసలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన భారత లేడీ ఆఫీసర్

Asia Cup 2025 Final: 41 ఏళ్ల తర్వాత పాక్‌తో ఫైనల్స్.. కెప్టెన్ సూర్యకుమార్ షాకింగ్ రియాక్షన్!

Medchal ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

Kiran Abbavaram: ‘కె-ర్యాంప్’.. దర్శకుడు మహేష్ ఫ్యాన్.. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్!