Amazon Offers (image Source: Freepic)
బిజినెస్

Amazon Offers: అమెజాన్ బంపరాఫర్.. తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్స్.. అస్సలు మిస్ అవ్వకండి!

Amazon Great Indian Festival Sale 2025: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. పండగ సేల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ – 2025’ పేరుతో వస్త్రాలు, మెుబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమైన ఈ సేల్ దాదాపు 4 వారాల పాటు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. కాబట్టి అమెజాన్ సేల్ లో తక్కువ ధరకే లభిస్తున్న టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ఎం4 (Apple MacBook Air M4 )

అమెజాన్ సేల్ లో ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ M4 ను భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ.99,900 విలువ కలిగిన ఈ ఆపిల్ మాక్ బుక్ ను రూ. 83,990కే కొనుగోలు చేయవచ్చు. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ (SBI Credite Card) ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ. 4,500 రాయితీ పొందవచ్చు. ఫలితంగా రూ.లక్ష విలువైన ఆపిల్ మాక్ బుక్ ను రూ. 82,240కే దక్కించుకోవచ్చు. ఒకవేళ పాత డివైజ్‌లను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 7,650 వరకు అదనపు తగ్గింపు పొందే ఛాన్స్ ఉంది.

2. ఆసస్ వివోబుక్ 16 (Asus Vivobook 16)

ఆసస్ వివోబుక్ 16 కూడా అమెజాన్ సేల్ లో మంచి ఆఫర్‌లో లభిస్తోంది. ఈ ల్యాప్ ట్యాప్ స్టైలిష్ లుక్‌ ను కలిగి ఉండటంతో పాటు పనితీరులోనూ మెరుగైన పర్ ఫార్మెన్స్ చేస్తుంది. లేటెస్ట్ ఇంటెల్ ప్రాసెసర్, సరిపడిన ర్యామ్ (RAM), 16 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్.. విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటర్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఆసస్ వివోబుక్ 16 అసలు ధర రూ. 84,990 కాగా.. తాజా సేల్ లో రూ. 54,990కే అందుబాటులోకి వచ్చింది.

3. హెచ్‌పి 15 (HP 15)

రూ. 35,000 లోపు బడ్జెట్ లో మంచి ల్యాప్ టాప్ కోసం ఎదురుచూసేవారికి హెచ్ పీ 15 మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. అట్రాక్టివ్ కీబోర్డ్, స్మూత్ పెర్ఫార్మెన్స్‌ కలిగిన ఈ ల్యాప్ టాప్.. ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్‌కి ఎంతో అనుకూలమైనది. ఇంటెల్ ప్రాసెసర్, ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, సరిపడిన స్టోరేజ్‌తో రూపొందిన ఈ ల్యాప్‌టాప్ ను 36 శాతం డిస్కౌంట్ తో పొందవచ్చు. రూ. 33,990కే కొనుగోలు చేయవచ్చు.

4. లెనోవో యోగా స్లిమ్ 7 (Lenovo Yoga Slim 7)

రూ.1,10,490 విలువ కలిగిన లెనోవో యోగా స్లిమ్ 7 ల్యాప్ టాప్.. అమెజాన్ సేల్ లో రూ. 70,990కి లభిస్తోంది. ప్రైమ్ మెంబర్స్‌కు అదనంగా రూ. 5,650 తగ్గింపు పొందవచ్చు. ఎస్బిఐ కార్డ్ వాడితే మరో రూ. 750 తగ్గింపు లభించనుంది. అంతేకాదు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఈ ల్యాప్ టాప్ పై అందుబాటులో ఉండటం గమనార్హం. 14 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్ ట్యాప్ 16జీబీ ర్యామ్, 512GB SSD కలిగి ఉంది. అద్భుతమైన మల్టీటాస్కింగ్ సామర్థ్యం ఈ ల్యాప్ టాప్ సొంతం. OLED డిస్‌ప్లే, డాల్బీ విజన్, HDR True Black 500, 100% DCI-P3 కలర్ సపోర్ట్‌తో దీనిని తీసుకొచ్చారు.

Also Read: Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

5. డెల్ వోస్ట్రో 15 (Dell 15)

డెల్ వోస్ట్రో 15 ఇప్పుడు అమెజాన్ లో రూ. 32,990కే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 48,441 కావడం గమనార్హం. ప్రైమ్ మెంబర్స్‌ మరో రూ. 2,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డ్ వాడితే మరో రూ. 500 తగ్గనుంది. ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 8GB RAM, 512GB SSDతో ఇది రూపొందింది. 15.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది వర్క్ చేస్తుంది. కేవలం 1.6 కేజీల బరువు మాత్రమే బరువు ఉండటం వల్ల డెల్ వోస్ట్రో 15ను ఎక్కడైన సులభంగా తీసుకెళ్లవచ్చు.

Also Read: Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!

Just In

01

Thaman speech: అలా ఏమీ చేయకపోయినా ‘ఓజీ’ హిట్ చేశారు.. ఎందుకంటే?

OG Producer: నిర్మాత నాగవంశీకి థ్యాంక్స్ చెప్పిన ‘ఓజీ’ నిర్మాత.. ఎందుకో తెలుసా?

Police Misconduct: సీక్రెట్‌గా మహిళా కంటెంట్ క్రియేటర్‌ కారుని ట్రాక్ చేసిన పోలీస్.. ఎక్కడికి దారి తీసిందంటే?

GHMC Commissioner: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త సంస్కరణలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!