Nodha Hospital ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Nodha Hospital: నోద హాస్పిటల్‌లో మళ్లీ ఆపరేషన్ వికటించిందా?..పేషెంట్ల ప్రాణాలు సైతం లెక్కలో లేనట్టేనా?

Nodha Hospital: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని నోద హాస్పిటల్ లో మరోసారి ఆపరేషన్ సంఘటన వివాదాస్పదంగా మారింది. తరచూ ఇక్కడ ఆపరేషన్లు వికటిస్తున్నాయన్న విషయం మళ్లీ వెలుగు చూసింది. తాజాగా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామ తండాకు చెందిన ధరావత్ ఏరియా – యాకమ్మ దంపతులు తమ కూతురిని కడుపునొప్పితో తొర్రూరు పట్టణంలోని నోద హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రమణమూర్తి అనే వైద్యుడు పేషెంట్‌ను పరిశీలించి, గర్భసంచి బాగాలేదు.. వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు అని భయపెట్టినట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

 Also Read:IND vs BAN Clash: రేపే మ్యాచ్‌.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్

మరోసారి పరిశీలించిన డాక్టర్ ఆపరేషన్ కుట్లు విప్పి, ఇన్ఫెక్షన్

పరిస్థితి తీవ్రంగా ఉందని భావించి తల్లిదండ్రులు ఆపరేషన్‌కు అంగీకరించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించగా మొదట్లో పరిస్థితి కాస్త సర్దుకున్నట్టే కనిపించింది. అయితే ఆపరేషన్‌ అయిన పది రోజులకే పేషెంట్‌ కాళ్లకు వాపులు రావడంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చి వైద్యుడిని సంప్రదించారు. మరోసారి పరిశీలించిన డాక్టర్ ఆపరేషన్ కుట్లు విప్పి, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంజక్షన్ వేయాలి అంటూ కొత్త ఇంజక్షన్ ఇచ్చాడు, కానీ ఆ ఇంజక్షన్ వేసిన వెంటనే పరిస్థితి మరింత విషమించిందని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల మాట్లాడుతూ…ఇంజక్షన్ వేసిన తర్వాత పేషెంట్‌కు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు. ప్రాణాలు పోయినా మేము బాధ్యత వహించము అని వైద్యుడు స్పష్టంగా చెప్పడం తమను షాక్‌కు గురి చేసిందని వాపోయారు.

ప్రజల ప్రాణాలను ఆటబొమ్మలుగా

ఈ ఘటన బయటకు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను ఆటబొమ్మలుగా తీసుకుంటున్న నోద హాస్పిటల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే మరెన్ని ప్రాణాలు బలవుతాయో..? అంటూ ప్రశ్నిస్తున్నారు.అదే సమయంలో ఈ ఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్య అధికారులు దృష్టి సారించాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ లాభాల కోసం ప్రాణాలతో చెలగాటమాడటం తగదని, ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Also Read:Hyderabad: అందరూ ఈ రూల్స్ పాటించాల్సిందే.. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదేశం

వరంగల్ జిల్లా ఎంజిఎం హాస్పిటల్ లో దారుణం..  కరెంట్ లేక ఆక్సీజన్ అందక రెండు నెలల బాలుడు మృతి

ఉత్తర తెలంగాణలో పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అధికారులు వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కు బదులుగా ..బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన మరువక ముందే మరో మరో చిన్నారిని పొట్టన పెట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోనే చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందడం వివాదాస్పదంగా మారింది.

రెండు నెలల బాబుకు ఆక్సిజన్ అందక మృతి

విద్యుత్ నిలిచిపోయి వెంటిలేటర్ పై ఉన్న రెండు నెలల బాబుకు ఆక్సిజన్ అందక మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు .ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన సంధ్య గణేష్ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించగా, గత మూడు రోజుల క్రితం బాబుకి స్నానం చేయిస్తున్న క్రమంలో సబ్బు నీరు నోట్లోకి చేరడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ములుగు లోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఎంజిఎం ఆసుపత్రి కి తరలించారు. ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో చికిత్స అందిస్తున్న క్రమంలో చిన్నారికి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో బాబును ఆసుపత్రిలోనే వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రిలో జనరేటర్ ఉన్న సరిగా పనిచేయకపోవడం

ఈ క్రమంలో ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెండు నెలల పసికందు మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రిలో జనరేటర్ ఉన్న సరిగా పనిచేయకపోవడం.. వెంటిలేటర్ కు ప్రత్యామ్నాయంగా మరొకటి రాకపోవడంతో ఇలాంటి ఘటన చోటుచేసుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయామని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని పేదల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 Also Read: Meenakshi Natarajan: తెలంగాణలో ఏఐసీసీ టాస్క్ ఇదే.. అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసేలా టార్గెట్!

Just In

01

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!

Seethakka: మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలి.. మంత్రి సీతక్కఆదేశం