Meenakshi Natarajan (imagecredit:twitter)
Politics

Meenakshi Natarajan: తెలంగాణలో ఏఐసీసీ టాస్క్ ఇదే.. అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసేలా టార్గెట్!

Meenakshi Natarajan: ఓట్ చోరిపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు సేకరించాలని ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) సూచించారు. అక్టోబరు 15 నాటికి పూర్తి చేయాల్సిందేనని కోరారు. ఏఐసీసీ టాస్క్ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని వెల్లడించారు. మంగళవారం ఆమె పార్టీ ముఖ్య లీడర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. అక్టోబర్ 15 నాటికి గ్రామ గ్రామాన సంతకాల సేకరణ జరగాలన్నారు. లక్షలాదిగా సంతకాల సేకరణ చేసి ఏఐసీసీ కి పంపాలన్నారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ చేస్తున్న ఓట్ చోరీ ఉద్యమంలో మనం అండగా నిలవాలన్నారు.

సంతకాల సేకరణ..

డిజిటల్ మెంబర్షిప్ లో తెలంగాణ(Telangana) మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మోడీ(Modhi), అమిత్ షా(Amit Shah) లు అటు ఎన్నికల కమిషన్ ను ఇటు ఓట్ చోరీ ని నమ్ముకొని మూడో సారి అధికారంలోకి వచ్చారన్నారు. ఓట్ చోరీ పై ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతి గ్రామంలో, అర్బన్ వార్డుల లో సంతకాల సేకరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ(Telangana) లో హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్ర హక్కైన ఓటు హక్కు రక్షణ కోసం సామాజిక సంస్థలు, పౌరసంఘాలు ముందుకొచ్చాయి. ఎన్నికల సమయంలో తరచుగా వెలుగుచూస్తున్న ఓటు చోరీ, బూత్ క్యాప్చరింగ్, నకిలీ ఓటింగ్ వంటి ఘటనలపై సంతకాల సేకరణ కార్యక్రమంను ప్రారంభించాయి.

Also Read: Siddipet District: నీ రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారమా.. బీజేపీ నేతలు ఫైర్

భద్రతా చర్యలు

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి ఓటరికి తన ఓటు తానే వేయగలిగేలా భద్రతా చర్యలు చేపట్టాలి. నకిలీ ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలి” అని డిమాండ్ చేశారు.సంతకాల సేకరణ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకుని సంతకాలు సేకరించిన ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్‌కి అందజేస్తారు.

Also Read: Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో 70% వాటా కావాలి.. వాదనలు వినిపించిన మంత్రి ఉత్తమ్

Just In

01

Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!

Big Breaking: తెలంగాణలో ఓజీకి ఎదురుదెబ్బ.. ప్రీమియర్స్ ఇక లేనట్లేనా?

Jogulamba Temple: జోగులాంబ ఆలయ మిస్టరీ.. అమ్మవారిని నేరుగా ఎందుకు దర్శించుకోరో తెలుసా?

OTT Movie: ఈ సీరియల్ కిల్లర్‌కు దొరికితే అంతే.. భయపడితే మాత్రం చూడకండి

OG Movie: విజయవాడలో పవన్ కళ్యాణ్ ఆల్ టైం రికార్డ్..!