MD Ashok Reddy (imagecredit:swetcha)
హైదరాబాద్

MD Ashok Reddy: తవ్విన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని జలమండలి ఎండీ ఆదేశం

MD Ashok Reddy: పైపు లైన్ విస్తరణ పనులు పూర్తయిన వెంటనే తవ్విన రోడ్లకు మరమ్మతు నిర్వహించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి(Ashock Reddy) అధికారులను ఆదేశించారు. వనస్థలిపురం ఓల్డ్ బాంబే- విజయవాడ హైవే వద్ద ధ్వంసం అయినా 900 ఎంఎం డయా ఆర్ సిసీ సీవర్ ట్రంక్ మెయిన్‌ పైప్ లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. జలమండలి చేపట్టే మరమ్మతులు పైపు లైన్ విస్తరణ పనులు పూర్తయిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం సీవర్ లైన్‌పై సుమారు 20 అడుగుల లోతులో కుంగిపోవడంతో వెంటనే స్పందించిన జలమండలి అధికారులు మరమ్మతు పనులను ప్రారంభించారు.

అప్‌స్ట్రీమ్ సీవర్ లైన్‌లో లీకేజీ..

ఈ భారీ సీవర్ ట్రంక్ మెయిన్ దాదాపు 25 సంవత్సరాల క్రితం జీహెచ్ఎంసీ(GHMC) నిర్మించి, ఆ తర్వాత 2021లో ఈ ప్రాంత సీవరేజ్ నిర్వహణ జలమండలికి అప్పగించినట్లు ఎండీ వెల్లడించారు. ఈ సీవర్ లైన్ దెబ్బతినడంతో, గాంధీనగర్, స్నేహమయినగర్, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, వీరాంజనేయ కాలనీ, సామా నగర్, శారదా నగర్, శాంతినగర్, తెలంగాణ పద్మావతి కాలనీల పరిధిలోని సుమారు 5 కి.మీ.ల మేర అప్‌స్ట్రీమ్ సీవర్ లైన్‌లో లీకేజీ ఏర్పడి, స్థానిక చెరువులు పొంగిపోవడంతో స్థానికంగా మురుగునీటి సమస్య తలెత్తిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, రహదారిలో పూడుకుపోయిన ట్రంక్ మెయిన్‌ సంబందించిన మాన్‌హోళ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Temple Land Scam: నత్తనడకన ఎండోమెంట్ భూముల కేసులు.. సమస్య ముందుకు సాగేనా..!

తక్షణమే చేపట్టాలి

భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలైతే అవకాశం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సంఘటనలు నివారించాలని సూచించారు. అలాగే, గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ హైవే క్రాసింగ్ వద్ద మురుగు సమస్యను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. సాగర్ కాంప్లెక్స్ వద్ద తిరుమలానగర్, శ్రీశ్రీ హోమ్స్, మధురా నగర్, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే మురుగు నీరు కలిసిపోవడంతో వర్షాకాలంలో స్తానికంగా మురుగు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు, వర్షపు నీరు సీవరేజ్‌లో కలిసిపోకుండా గ్యాప్ వర్క్ తక్షణమే చేపట్టాలని ఎండీ అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, ఎస్టీపీ, ప్రాజెక్టు అధికారులు అందరూ సమన్వయంతో సీవరేజ్ నేరుగా మూసీలో చేరకుండా స్థానిక ఎస్టీపీ కి మళ్లించి, శుద్ధి చేసేలాగా పైప్ లైన్ ల ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ పర్యటనలో ఎండీతో పాటు సీజీఎం నాగేందర్, జీఎంలు బలరామరాజు, మహేందర్ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: IND vs BAN Clash: రేపే మ్యాచ్‌.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Just In

01

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన

OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!