Team-India-Target
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

Ind Vs Pak: ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ (Ind Vs Pak) మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌‌లో దాయాది పాక్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ 171 పరుగులు సాధించింది. దీంతో, భారత విజయ లక్ష్యం 172 పరుగులుగా ఖరారైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ వ్యక్తిగత స్కోరు 58 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లు మాత్రమే సాధించాయి. అయితే, ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఏకంగా, నాలుగైదు చక్కటి క్యాచ్‌లు జారవిడిచారు. చేతుల్లో పడ్డ క్యాచ్‌లను కూడా నేలపాలు చేశారు. దీంతో, పలువురు పాక్ బ్యాటర్లు లైఫ్‌లు లభించాయి.

మ్యాచ్ ఆరంభం ఓవర్‌లోనే పాకిస్థాన్‌కు లైఫ్ దొరికింది. అభిషేక్ శర్మ రెండు క్యాచులు వదిలేశాడు. కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్ చెరో క్యాచ్‌ డ్రాప్ చేశారు.

అర్ధ సెంచరీ సాధించిన సాహిబ్‌జాదా ఔటైన తర్వాత, భారత బౌలర్లు రన్ రేటును కొంతవరకు నియంత్రించగలిగారు. అయితే, ఫీల్డింగ్ వైఫల్యం ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశ పరిచింది. పార్ట్‌టైమ్ బౌలర్ శివమ్ దూబే రెండు కీలకమైన వికెట్లు తీసి భారత్ తరపున బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.

Read Also- Ind Vs Pak Toss: భారత్-పాక్ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య.. టీమ్‌లో కీలక మార్పులు

ఇదిలావుంచితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫఖర్ జమాన్ అవుట్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్యాచ్‌ను వికెట్ కీపర్ సంజు శాంసన్‌ చక్కగా పట్టాడా?, బంతి గ్రౌండ్‌ను తాకిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కామెంటరీలో ఉన్న వకార్ యూనిస్ కూడా ఈ క్యాచ్ క్లియర్‌గా లేదని విమర్శించాడు.

మరోవైపు, ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మ్యాచ్‌లో టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాతో కరచాలనం చేయలేదు. దీంతో, మరోసారి వివాదం చెలరేగింది.

Read Also- OG concert rain disruption: వరుణుడి ఎఫెక్ట్ తో నిరాశపరిచిన ‘ఓజీ’ కాన్సర్ట్.. మరీ ఇన్ని అడ్డంకులా..

తుది జట్లు ఇవే

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్: సైమ్ అయూబ్, సహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

 

 

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?