GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఔత్సాహిక క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడే జీహెచ్ఎంసీ(GHMC) స్పోర్ట్స్ కాంప్లెక్సు(Sports complexes)ల నిర్వహణ బాధ్యతలను ఇకపై ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణకు చేస్తున్న ఖర్చుతో పోల్చితే వీటి నుంచి వస్తున్న ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో వీటి నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ముఖ్యంగా ఆదాయం తక్కువగా వస్తున్నా, వెచ్చిస్తున్న వ్యయానికి తగిన విధంగా నిర్వహణ లేకపోవటంతో మెరుగైన నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీలకు వీటిని అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పది స్పోర్ట్స్ కాంప్లెక్సులను అప్పగించేందుకు వీలుగా ఈ నెల 12వ తేదీ నంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ కమ్ బిడ్లను) ఆహ్వానించారు. వీటి స్వీకరణ గడువు శుక్రవారం మధ్యాహ్నాం పన్నెండు గంటలకు ముగిసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక సంక్షోభంతో నిర్వహణ భారంగా మారటం, వెచ్చిస్తున్న మొత్తానికి కనీస ఆదాయం రాకపోవటంతో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తూ కార్పొరేట్ లుక్ వస్తుందని, దీంతో వీటి వినియోగం పెరిగి జీహెచ్ఎంసీకి ప్రైవేటు ఏజెన్సీలకు ద్వారా వర్షాక ఆదాయాన్ని సమకూరుతుందని అధికారులు లెక్కలేస్తున్నట్లు తెలిసింది.
Also Read: Little Hearts success meet: విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. వారి తర్వాతే ఎవరైనా
స్టాండింగ్ కమిటీ ఆమోదం లేదు
గ్రేటర్ సిటీలోని సుమారు కోటిన్నర మంది జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది చేయటంతో పాటు అత్యవసర సేవల నిర్వహణతోై పాటు జీహెచ్ఎంసీ(GHMC) పరిపాలన వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ(Standing Committee)ని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్నవిషయంపై పక్కన బెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ స్పొర్ట్స్ కాంప్లెక్సులను మెరుగైన నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రతిపాదనకు జీహెచ్ఎంసీలో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఆమోదం లేనట్లు తెలిసింది. దీంతో పాటు ఈ విషయం అదనపు కమిషనర్ (స్పోర్ట్స్ ) కు కూడా తెలియకుండానే ఈఓఐ కమ్ బిడ్లను స్వీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని సర్కిల్ -18లోని షేక్ పేట స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్లే గ్రౌండ్, సర్కిల్ -17లోని అమీర్ పేట స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదే సర్కిల్ లోని సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,ప్లే గ్రౌండ్, సర్కిల్ 14లోని హిందీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్లే గ్రౌండ్, సర్కిల్ 12లోని రెడ్ హిల్స్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదే సర్కిల్ లోని విజయనగర్ కాలనీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్కిల్ 14లోని జీహెచ్ఎంసీ విక్టోరియా ప్లే గ్రౌండ్, ఇండోర్, ఔట్ డోర్ స్టేడియం, సర్కిల్ 13లోని గోల్కొండ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, సర్కిల్ 12లోని తాళ్లగడ్డ కబడ్డీ స్టేడియం, సర్కిల్ 1లోని జూబ్లీహిల్స్ టెన్నీస్ కోర్ట్ లను మెయింటనెన్స్, ఆపరేషన్ నిమిత్తం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పిగించేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్దం చేసింది. ఇందకు సంబంధించి ఈ నెల 12 నుంచి శుక్రవారం మధ్యాహ్నాం పన్నెండు గంటల వరకు ఈఓఐ, బిడ్లను జీహెచ్ఎంసీ స్వీకరించింది. త్వరలోనే వీటిని తెరిచి ఏజెన్సీలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
Also Read: Deepika Padukone: ‘కల్కీ’ నుంచి తప్పించిన తర్వాత దీపికా పదుకొణె ఏం చేస్తుందంటే?