Little Hearts success meet: విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..
VIJAY-DEVARAKONDA( inage :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Little Hearts success meet: విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. వారి తర్వాతే ఎవరైనా

Little Hearts success meet: యువతను ఆకర్షించిన రొమాంటిక్ కామెడీ సినిమా ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పటికే విడుదలై ఏ స్టాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలిసిందే. ఈ చిత్రం, మౌళి తానూజ్ ప్రసాంత్, శివాని నాగరామ్ జంటగా నటించారు. డైరెక్టర్ సాయి మార్తాండ్ రాసి, తీర్చిన ఈ యువ ప్రేమ కథ, పరీక్షలో విఫలమైన అఖిల్ (మౌళి), కాత్యాయిని (శివాని) మధ్య జరిగే హాస్యాస్పదమైన ప్రేమా ప్రయాణాన్ని చూపిస్తోంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తాజాగా, మెలోడ్రామా లేకుండా, పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. డే వన్ కలెక్షన్స్ 2.5 కోట్లు, మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ లాభాలు సంపాదించింది. ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్, డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు, వంశీ నందిపాటి చేత ప్రమోట్ చేయబడిన ఈ చిత్రానికి, అల్లు అర్జున్, రవి తేజ, అనిల్ రవిపూడి వంటి సెలబ్రిటీలు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అల్లు అర్జున్ ట్వీట్: “నో మెలోడ్రామా, నో గ్యాన్… జస్ట్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్” అని ప్రశంసించారు.

Read also-YS Sharmila: బెన్‌ఫిట్ టికెట్లపై ఉన్న శ్రద్ధ.. రైతుల గిట్టుబాటు ధరపై లేదు.. పవన్‌పై షర్మిల ఫైర్!

ఈ సినిమా విజయాన్ని హైదరాబాద్‌లో ‘లిటిల్ హార్ట్స్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ’ అనే గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. మూవీ టీం మౌళి, శివాని, డైరెక్టర్ సాయి మార్తాండ్, ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్, డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు, వంశీ నందిపాటి తో పాటు, అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్ చైర్మన్), బండ్ల గణేష్ వంటి సీనియర్ ప్రొడ్యూసర్లు హాజరయ్యారు. ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, అల్లు అరవింద్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అతని బ్లంట్, హాస్యాస్పదమైన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బండ్ల గణేష్, తన స్పీచ్‌లో మొదట ‘లిటిల్ హార్ట్స్’ టీమ్‌ను అభినందించారు. “ఈ సినిమా తీసినందుకు బన్నీ వాసు, వంశీ నందిపాటికి అభినందనలు. ఇది ఒక చిన్న బడ్జెట్ చిత్రం, కానీ ప్రేక్షకుల హృదయాల్లో పెద్ద స్థానం పొందింది. డైరెక్టర్ సాయి మార్తాండ్, మౌళి, శివాని వంటి యువ కళాకారులు గొప్ప పని చేశారు. పెద్ద డైరెక్టర్లు ఇలాంటి చిన్న సినిమాలు చూసి తల వంచాలి” అని ప్రశంసించారు.

Read also-Bobby Kolli: అనుదీప్ చేసిన పనికి షాక్ అయిన బాబి కొల్లి.. అందుకే అలా చేశాడు

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘మనము ఎవ్వడిలా ఉండాల్సిన అవసరం లేదు. అమ్మానాన్నలను సంతోషంగా ఉంచడం, వాళ్ళు గర్వపడేలా చేయడం కంటే మించిన సక్సెస్ ఉండదు. ముందు వాళ్లు, తర్వాతే ఎవరైనా. మీ సినిమా చూసి, టీనేజర్లు, యువత అంతా ఫ్యామిలీలతో వచ్చి చూశారు. అల్లు అరవింద్ కూడా చెప్పారు కదా.. ‘టీనేజర్లతో సినిమా చూస్తే ఇంత గొల్ల ఉంటుందా?’ అని. అది మీ విజయం! మీ సక్సెస్ అయితే, మీతో పాటు మరో ముప్పై, నలభై మంది జీవితాలు మారుతాయి. ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న సినిమాలు వస్తే, పెద్ద హిట్స్ వస్తాయి. బన్నీ వాసు, వంశీ .. మీరు డిస్ట్రిబ్యూట్ చేసి, ఈ విజయాన్ని పెంచారు.’ అంటూ చెప్పుకొచ్చారు.

Just In

01

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

Engineering Fees: ఇంకా విడుదల కాని జీవో.. ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!

Emmanuel Elimination: అభిమానులకు ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ నోట్.. ఏం అన్నారంటే?