Vijay Deverakonda: బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏ ఫంక్షన్‌కు అటెండ్ అయినా అటెన్షన్ మొత్తం ఆయన వైపే ఉండేలా చూసుకుంటారనే విషయం తెలియంది కాదు. ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అయినా సరే.. అందరూ బండ్ల గణేష్ వైపే చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ఫంక్షన్ అనగానే బండ్లకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది ఈ మధ్య ఆయన సినిమాలకు బండ్ల గణేష్‌ని రానివ్వడం లేదు.. కారణాలు ఏమైనప్పటికీ, ఫ్యాన్స్ ఆయనను బాగా మిస్ అవుతున్నారు. అందుకే, చాలా గ్యాప్ తర్వాత చేతికి మైక్ దొరకడంతో.. మరోసారి తన వాయిస్ పవర్ ఏంటో చూపించాడు బండ్ల గణేష్. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని.. మేకర్స్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అరవింద్ (Allu Aravind), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్.. అల్లు అరవింద్‌ని ఉద్దేశించి, మౌళిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read- Fauji: ప్రభాస్ ‘ఫౌజి’తో టాలీవుడ్‌కు వస్తున్న మరో బాలీవుడ్ హీరో..!
బండ్లకు రౌడీ స్టార్ కౌంటర్
అల్లు అరవింద్‌ని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత బన్నీ వాస్ కౌంటర్ ఇస్తే, మౌళిని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి అంతా బండ్ల గణేష్ స్పీచ్‌ని పట్టించుకుని, విజయ్ దేవరకొండ స్పీచ్‌ని మిస్సయ్యారు. విజయ్ స్పీచ్‌ని గమనిస్తే.. బండ్లకు పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడని అనుకోవడమే కాకుండా.. ఇదెలా మిస్సయ్యామని కూడా అనుకుంటారు. ముందుగా మౌళిని ఉద్దేశించి బండ్ల గణేష్.. కొన్ని సలహాలు ఇచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెట్టుకురావడం అంత ఈజీ కాదని అన్నారు. ఇక్కడ మాఫియా నడుస్తుందని హింట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ రౌడీ టీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు అని పొంగి పోకుండా వాస్తవంలో బతుకు. చంద్రమోహన్ (Chandra Mohan)లా సినిమాలు చెయ్. ఈ ఫ్రైడేనే నీది. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వస్తాడు.. అంటూ కొన్ని ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి కొన్ని సలహాలు ఇచ్చాడు. వీటన్నింటికి కౌంటర్ అన్నట్లుగా విజయ్ దేవరకొండ ఒక్కటే మాట అన్నారు.. ‘ఎవరి సలహాలు వినాల్సిన అవసరం లేదు.. పేరెంట్స్ హ్యాపీగా ఉండేలా చూసుకో. అలాగే కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకో’ అని మౌళికి చెప్పారు. అంతే, ఇది కదా కౌంటర్ అంటే అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- Bunny Vasu reaction: బండ్లన్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన బన్నీవాస్.. అప్పుడే ఆయన స్టార్ అయ్యారు
అందుకే వీళ్లకు సపోర్ట్ చేయాలనిపించింది
విజయ్ దేవరకొండ ఈ వేడుకలో మాట్లాడుతూ.. ‘‘నా తమ్ముడు ఆనంద్ ద్వారా.. నాకు ఈ సినిమా గురించి చాలా రోజులుగా తెలుసు. ఆనంద్ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్‌తో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు నాకు పంపిస్తుండేవాడు. ఈ టీమ్‌లోని వారిని నేనెప్పుడూ కలవలేదు కానీ, వాళ్లతో నాకు ఏదో అనుబంధం ఉందని అనిపించేది. మౌళి అండ్ టీమ్ మా ఇంటికి వచ్చి కలిసినప్పుడు సక్సెస్ మీట్‌కు రావాలని అడిగారు. వాళ్లు అడగగానే నేను కాదనలేకపోయా. వీళ్లంతా బయటి వ్యక్తులు. ఏ సపోర్ట్ లేకుండా సక్సెస్ అందుకున్న వీళ్లు.. ఇంకా ఎంతో మంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఒకరు సక్సెస్ అయితే.. అది చాలా మందికి మంచి చేస్తుంది. ఒక ఫైర్ న్యూ టాలెంట్‌లో కలిగేలా చేస్తుంది. అందుకే వీళ్లకు సపోర్ట్ చేయాలని నాకు అనిపించింది. నేను ఏ సినిమా టీమ్‌ను కలిసినా కాసేపే మాట్లాడతాను. కానీ ‘లిటిల్ హార్ట్స్’ టీమ్‌తో దాదాపు మూడు గంటలు మాట్లాడాను. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక చిన్న కథను ఎంతో బ్యూటీఫుల్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. క్యాస్టింగ్ కరెక్ట్‌గా సెట్ చేశాడు. కాత్యాయని పాత్ర శివానీ బాగా నటించింది. మౌళి రీల్స్‌ను ఆనంద్ నాకు చూపించి, ఇతన్ని సినిమాల్లోకి తీసుకురావాలని అనేవాడు. ఈ సినిమాను మౌళి ఎంటర్‌టైనింగ్‌గా ప్రమోట్ చేసుకున్నాడు. అతని ప్రమోషన్స్ మరోసారి చూసేందుకు.. మౌళి చేసే నెక్ట్స్ సినిమా కోసం ఎదురు చూస్తుంటాను. నాకు మా పేరెంట్స్ ఫస్ట్, సినిమా నెక్ట్స్. మౌళికి కూడా నేను చెప్పేది ఒక్కటే.. నువ్వు నీలాగే ఉండు. ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు హ్యాపీగా ఉండేలా చూసుకో. అలాగే నీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకో.. అంతే. ఈ టీమ్ మరిన్ని మంచి సక్సెస్‌ఫుల్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు