Heroine: ఒక నటికి రూ. 530 కోట్ల పారితోషికం ఏంటి సామి? అసలు వింటేనే షాకింగ్ ఫీలింగ్ వస్తుంటే.. పిలిచి మరీ అంత అమౌంట్ ఇవ్వడం ఏమిటి? దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమాలోని హీరోయిన్‌కు కూడా అంత రెమ్యూనరేషన్ ఉండదు కదా. ఇండియాలోనే అంటున్నారు కాబట్టి.. ఇండియాలో ఏ హీరోకి కూడా ఇంత రెమ్యూనరేషన్ లేదు కదా! బాలీవుడ్ ఖాన్‌లకు, బాహుబలి హీరోకు కూడా లేని, రాని రెమ్యూనరేషన్ ఒక నటికి ఇస్తున్నారంటే, ఆ నటిలో ఉన్న అంత స్పెషల్ ఏంటో అని అంతా అనుకుంటున్నారు కదా. నిజమే ఆ నటి స్పెషలే మరి. అందుకే అంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇంతకీ ఆ నటి ఎవరు? అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్‌లో..
బాలీవుడ్ (Bollywood)లో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించడానికి హాలీవుడ్ నటి (Hollywood Actress) సిడ్నీ స్వీనీ (Sydney Sweeney)కి రూ. 530 కోట్ల పారితోషికంతో ఆఫర్ వచ్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఇది బాలీవుడ్‌లో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా చెబుతున్నారు. ఓ ప్రముఖ వార్తాపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, ఒక నిర్మాణ సంస్థ ఈ భారీ మొత్తంతో ఆమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆఫర్‌లో రూ. 415 కోట్లు పారితోషికం రూపంలోనూ, మిగిలిన రూ. 115 కోట్లు స్పాన్సర్‌షిప్ ఒప్పందాల రూపంలోనూ ఇవ్వనున్నారట. ఈ చిత్రంలో సిడ్నీ ఒక యువ అమెరికన్ స్టార్ (Young American Star) పాత్రలో నటించనుందని, ఆమె ఒక ఇండియన్ సెలబ్రిటీతో ప్రేమలో పడుతుందని ఈ నివేదిక పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 ప్రారంభమై.. న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ వంటి వివిధ ప్రాంతాలలో జరగవచ్చని భావిస్తున్నారు.
కేవలం రూమరే.. అధికారిక ప్రకటన రాలేదు
ఇంకా ఈ కథనంలో ఏం తెలిపారంటే.. ఈ ఆఫర్ గురించి తెలిసి మొదట ఆమె ఆశ్చర్యపోయారని, కానీ.. ఈ ప్రాజెక్ట్ ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భావించి ఓకే చెప్పిందట. అయితే ఈ వార్తలపై సిడ్నీ స్వీనీ ప్రతినిధులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని వారే ఈ నివేదికలో తెలపడం విశేషం. సిడ్నీ స్వీనీ లేదా ఆమె ప్రతినిధులు ఈ విషయాన్ని ధృవీకరిస్తే మాత్రం.. ఇండియన్ సెలబ్రిటీలు, ప్రేక్షకులు అంతా కూడా ఆశ్చర్యపోకమానరు. ఈ విషయంలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే మాత్రం సిడ్నీ స్వీనీ నుంచి లేదంటే ఆమె ప్రతినిధుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు దీనిని ఓ రూమర్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. అందులోనూ సినిమా పరిశ్రమలో ఇటువంటి వార్తలు తరచుగా ప్రచారమవుతుంటాయనే విషయం తెలియంది కాదు. చూద్దాం.. అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..
Also Read- Mirai Movie: ‘మిరాయ్’లో మంచు మనోజ్ చేసిన పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
సిడ్నీ స్వీనీ విషయానికి వస్తే..
సిడ్నీ ప్రముఖ టీవీ డ్రామా యూఫోరియా (Euphoria), బ్లాక్ కామెడీ ది వైట్ లోటస్ (The White Lotus) లలోని పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె త్వరలో క్రిస్టీ (Christy) అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె అమెరికా ప్రొ ఫైటర్ క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తుంది. క్రిస్టీ మార్టిన్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పత్రిక కవర్ పేజీపై కనిపించిన మొదటి మహిళా బాక్సర్. బెన్ ఫోస్టర్, మెరిట్ వెవర్ వంటి వారు నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. డెనిమ్ బ్రాండ్ అమెరికన్ ఈగల్ (American Eagle)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు