Kavitha: విమోచన దినోత్సవమంటూ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మోడీపై ప్రేమ లేకపోతే తప్పుడు ప్రచారం ఆపాలంటూ కాంగ్రెస్ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని వెల్లడించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఆనాటి పోరాట యోధుడు ఎం.కే మొయినోద్దీన్ ను సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.
Also Read: Mahesh Kumar Goud: కవితకు విలీన దినోత్సవానికి ఏం సంబంధం?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్
ప్రజల పోరాట స్ఫూర్తికి రైతాంగ సాయుధ పోరాటం
రాచరికపు నీడను అడ్డుపెట్టుకొని భూస్వాములు, దొరలు ఆనాడు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం చేసిన రోజూ సెప్టెంబర్ 17 అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 1942 లో సాయుధ రైతాంగ పోరాటం మొదలైందన్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ రష్యాన్ యూనివర్సిటీల్లో పాఠాలుగా చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి రైతాంగ సాయుధ పోరాటం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా రాచరికపు పాలనను వ్యతిరేకిస్తామని తెలంగాణ ప్రజలు ప్రతి సందర్భంలో నిరూపిస్తూనే ఉన్నారన్నారు. బీజేపీ నాయకులు ఇది ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అది హిందూ, ముస్లింల పోరాటం కానే కాదు… దొరలు, భూస్వాములు, రాచరిక పాలనకు వ్యతిరేక పోరాటం అని, కానీ దాన్ని మతతత్వ పోరాటమన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం
తెలంగాణను భారత్ లో తామే విలీనం చేశామంటూ పీసీసీ ప్రెసిడెంట్ సుద్దపూస మాటలు మాట్లాడారని, కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. వాళ్లకు అంత సీన్ లేదని, భారత్ లో తన సంస్థానాన్నిసెప్టెంబర్ 17 న విలీనం చేస్తానని అప్పటి ముస్లిం రాజు ప్రకటించారన్నారు. అయినప్పటికీ ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యాన్ని ఇక్కడకు రప్పించారని, ఆ ఆపరేషన్ పోలో కారణంగా ఎంతో మంది హిందూవులు, ముస్లింలు చనిపోయారన్నారు. అప్పుడు భారత సైన్యం వచ్చిన మార్గాలను దండు బాటలు అంటారని, ఇప్పటికీ ఆ దండు బాటలు ఉన్నాయన్నారు. నిజంగా మోడీ మీద ప్రేమ లేకపోతే వెంటనే వాళ్లు తెలంగాణలో చేస్తున్న కార్యక్రమాలను వ్యతిరేకించండి అని కాంగ్రెస్ కు సూచించారు. గంగా, జమున తెహజీబ్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుసునే రోజుగానే చూస్తామని, తెలంగాణ జాగృతిగా మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. అబద్దపు హామీలిస్తున్న కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Also Read: Tamannaah Bhatia: వరుస ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ..