Tamannaah Bhatia: తమన్నా భాటియా, మిల్కీ బ్యూటీగా పిలుచుకునే ఈ నటి, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకవైపు హీరోయిన్‌గా సినిమాల్లో దూసుకెళ్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ, తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్ చేస్తే కెరీర్‌కు ఇబ్బందని అనుకునే రోజులు ఇప్పుడు చరిత్ర. తమన్నా స్పెషల్ సాంగ్స్ ఆమెకు బంపర్ ఆఫర్లను తెచ్చిపెడుతున్నాయి. ‘జైలర్’, ‘బోలే చుడియాన్’, ‘స్ట్రీ 2’, ‘రైడ్ 2’ వంటి సినిమాల్లో ఆమె చేసిన స్పెషల్ నంబర్స్ ఆమెకు భారీ క్రేజ్ ను తెచ్చాయి. ఇప్పుడు తమన్నా మొదటి సారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన గ్లామర్‌తో మెరవనుంది.
Also Read: TGPSC Controversy: గ్రూప్ 1 పోస్టులకు రూ.3 కోట్లు.. నిరూపించాలంటూ తల్లితండ్రులు డిమాండ్!
షారూఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్‌లో తమన్నా ఓ హాట్ స్పెషల్ పాటతో అలరించనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 18, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక సినిమా కోసం ఆరు నెలలు కష్టపడితే 4-5 కోట్ల రెమ్యూనరేషన్ వస్తే, కేవలం కొన్ని రోజుల షూటింగ్‌తో స్పెషల్ పాటకి 1-2 కోట్లు సంపాదిస్తోంది తమన్నా.
Also Read: Aarogyasri Services: ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి
అందుకే, ఆమె ఈ ఆఫర్లను వదులుకోకుండా, తన గ్లామర్, నటనా నైపుణ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో ‘రొమియో’, ‘రేంజర్’, ‘వివాన్’ వంటి సినిమాలు ఉన్నాయి. స్పెషల్ సాంగ్స్‌తో పాటు కథానాయికగా కూడా అవకాశాలు అందుకోవడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్. సినిమాల్లో నటిస్తూనే, స్పెషల్ నంబర్స్‌తో జోష్‌ను కొనసాగిస్తూ, తమన్నా బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.