Meena: సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు తెలుగు సినీ అభిమానులకు సుపరిచితం. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ నటి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించి, తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఇటీవల, సీనియర్ హీరో జగపతి బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” అనే టాక్ షోలో మీనా గెస్ట్ లా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన జీవితంలోని కొన్ని మరపురాని ఘట్టాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ షోలో మాట్లాడుతూ మీనా తన సినీ ప్రస్థానం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది.
” కొందరు నిర్మాతలు తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీస్తామని నా దగ్గరకు వచ్చేవారు. ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ, ఆ తర్వాత నన్ను పట్టించుకునేవారు కాదు. అవకాశాలు వెల్లువెత్తుతున్న సమయంలోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది. అప్పుడు ‘దృశ్యం’ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు. కూతురు చిన్నది కావడంతో మొదట నేను తిరస్కరించాను. కానీ, దర్శకుడు ‘ఈ కథ మీ కోసమే రాసామని, మీరు లేకుండా సినిమా ఊహించలేమ’ని చెప్పడంతో ఇక చేయాల్సి వచ్చింది” అని మీనా చెప్పుకొచ్చింది.
Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!
అంతేకాదు, తన రెండో వివాహం గురించి వచ్చిన పుకార్లపై కూడా మీనా రియాక్ట్ అయింది. ” నా భర్త మరణించిన కొద్ది రోజుల్లోనే నేను రెండో పెళ్లి చేసుకున్నానని కొందరు రూమర్స్ పుట్టించారు. ఆ టైం లో ఆ రూమర్స్ నాకు చాలా బాధను కలిగించింది. ‘ఇలాంటి వాళ్లకు కుటుంబాలు ఉండవా? ఇలా ఎందుకు రాస్తారు?’ అని అనుకున్నా. ఈ పుకార్లు కొన్ని రోజులు అయితే.. అనుకోవచ్చు కానీ చాలా కాలం కొనసాగాయి. ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా, వారి పెళ్లి నాతోనే అని రాసేవారు,” అంటూ భావోద్వేగానికి లోనైంది మీనా. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!