Jatadhara Movie: సుధీర్ బాబు ‘జటాధర’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Jatadhara Still
ఎంటర్‌టైన్‌మెంట్

Jatadhara Movie: సుధీర్ బాబు ‘జటాధర’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

Jatadhara Movie: నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుందని మేకర్స్ చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే ఇటీవల వచ్చిన టీజర్ మంచి ఆదరణను రాబట్టుకుని, నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

విజువల్ స్పెక్టకిల్ చిత్ర రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పోస్టర్స్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ విజువల్ స్పెక్టకిల్ చిత్రాన్ని 7 నవంబర్, 2025న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ సుధీర్ బాబు స్టిల్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్‌లో కండలు తిరిగిన శరీరంతో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. మెడలో రుద్రాక్షల దండ, వెనుక ఆలయం అంతా డివైన్ లుక్‌ని పరిచయం చేస్తున్నాయి. ఈ స్టిల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌‌తో డివైన్ ఎనర్జీ నింపేసిందీ చిత్రం.

Also Read- Handshake Controversy: ‘నో షేక్‌హ్యాండ్’ పరాభవం నుంచి బయటపడని పాక్.. కీలక అధికారిపై పీసీబీ వేటు

ఒక కొత్త లోకంలోకి తీసుకెళుతుంది

ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సీబీఓ ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా సాధారణమైన సినిమా కాదు, ఇది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది‌. స్కేల్, స్టోరీ టెల్లింగ్, విజన్ పరంగా ఆడియన్స్‌ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలమని అన్నారు. ప్రేరణ అరోరా మాట్లాడుతూ.. ‘రుస్తుమ్’ తర్వాత జీ స్టూడియోస్‌తో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను గ్లోబల్ లెవెల్‌లో ప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఎమోషనల్‌గా, విజువల్‌గా అందరికీ రేర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని తెలిపారు. డైరెక్టర్స్ వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘జటాధర’ ఒక ఫోక్ టేల్‌ నుంచి పుట్టిన అద్భుతమైన కథని అన్నారు. డివైన్ పవర్, కాస్మిక్ డెస్టినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోందని, ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారని పేర్కొన్నారు.

Also Read- Gandhi Jayanti: గాంధీ జయంతి రోజున దసరా పండుగ.. మటన్, చికెన్, మద్యం విక్రయాలపై చర్చ

ప్రధాన తారాగణం వీరే..

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా‌తో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ వంటి వారంతా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా ప్రెజెంట్ చేస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Govt Hospitals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో ‘క్లీన్’ ఆపరేషన్.. ప్రజల సహకారం కోరిన డీఎంఈ

Student Suicide: పరీక్షల ఒత్తిడితో రాయగఢ్ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న చివరి లేఖ

Mahesh Training: ‘వారణాసి’ కోసం ‘కలరిపయట్టు’ నేర్చుకుంటున్న మహేష్ బాబు.. ఇది వేరే లెవెల్..

Girl Kills Father: నాన్నకు డ్రగ్స్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక దగ్గరుండి ప్రియుడితో చంపించిన బాలిక

Manikrao Kokate: మాజీ మంత్రి కోకటేకు ఊరట.. మోసం కేసులో శిక్ష అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు