Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) హౌస్‌లో రెండో వారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. మొదటి వారం హౌస్ నుంచి శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ కాగా, నామినేషన్స్‌లో ఉన్న వారంతా సేఫ్ అయ్యారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ.. చివరికి ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ పవన్, శ్రష్ఠి వర్మలను యాక్టివిటీ రూమ్‌కు పిలిచి, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ డ్యాన్స్‌ర్స్ డ్రస్‌పై ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వారు సేఫ్ అని ప్రకటించారు. డ్యాన్సర్స్ షర్ట్‌పై పవన్ ఫొటో వచ్చింది. అంతే, పవన్ నువ్వు సేఫ్ అని చెప్పి, శ్రష్ఠి వర్మను త్వరగా స్టేజ్‌పైకి రమ్మని పిలిచారు. శ్రష్ఠి వర్మ స్టేజ్‌పైకి వచ్చిన అనంతరం హౌస్‌లో జెన్యూన్ పర్సన్స్ ఎవరు? కెమెరా ముందు యాక్ట్ చేస్తున్న పర్సన్స్ ఎవరనే టాస్క్‌ని శ్రష్ఠి వర్మతో ఆడించారు. శ్రష్ఠి వర్మ ఎలిమినేటై (Shrasti Varma Elimination) వెళ్తూ వెళ్తూ.. హౌస్‌లో తనని ఇబ్బంది పెట్టిన ముగ్గురిని ఇరికించి వెళ్లారు. రీతూ, తనూజ, భరణి.. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్లుగా ఆమె కింగ్ నాగ్‌కు తెలియజేశారు. అలాగే బిగ్ బాంబ్‌ని సుమన్ శెట్టిపై పేల్చారు. ఇంట్లో తను చేసే క్లీనింగ్ పనిని ఇకపై సుమన్ శెట్టి చేయాలని శ్రష్ఠి బాంబ్ పేల్చారు. అలా.. ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.
Also Read- Jayammu Nichayammu Raa: డాడీ అని పిలిచిన తేజ సజ్జా.. ఫీలైన జగ్గూ భాయ్.. వీడియో వైరల్!
ఈ వారం నామినేషన్ రూల్ ఏంటంటే..
తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 డే 8కి సంబంధించి ఓ ప్రోమోని టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఈ వారం నామినేషన్స్ (Week 2 Nominations) మొదలైనట్లుగా చూపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ చేసే రోజు వచ్చేసింది. మీరు ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యులను, తగిన కారణాలను స్పష్టంగా చెప్పి, నామినేట్ చేసి, వారి ముఖానికి రెడ్ పెయింట్‌ను పూయాల్సి ఉంటుంది’ అని చెప్పారు. హరీష్, ఫ్లోరా శైనీ, భరణి, రీతూ చౌదరిలకు రెడ్ పెయింట్ పడుతున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. ఇందులో హరీష్, ఫ్లోరాలను తనూజ నామినేట్ చేసినట్లుగా చూపించారు. భరణి, రీతూలను మనీష్ నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇలా ఈ వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా జరిగాయనేది ఈ ప్రోమోని చూస్తుంటే తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే, రాత్రికి ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read- Mirai Movie: ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ.. ‘మిరాయ్’ మేకర్స్ సంచలన నిర్ణయం
ఆర్గ్యూమెంట్స్ హీట్..
ఈ ప్రోమో చూస్తుంటే.. బిగ్ బాస్ హౌస్‌లో రెండో వారం చాలా ఆసక్తికరంగా షో మొదలైనట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నామినేషన్ల పరంగా చాలా హీటెక్కినట్లుగా అర్థమవుతోంది. ఒక్కొక్కరు పెద్ద గొంతు వేసుకుని, కంటెస్టెంట్స్‌పై అరుస్తున్నారు. అదేమంటే నా ఇష్టం అంటున్నారు. ముఖ్యంగా తనూజ, రీతూ, హరీష్ ఈ ప్రోమోలో బాగా హైలెట్ అవుతున్నారు. భరణి నామినేషన్స్‌లో ఉన్నా, కామ్‌గానే కనిపిస్తున్నారు. అలాగే ఫ్లోరా షైనీ కూడా కూల్‌గా తనని నామినేట్ చేసిన కారణాలకు కౌంటర్ ఇస్తుంది. మిగతా వారి నామినేషన్స్‌కు సంబంధించి ఈ ప్రోమోల చూపించలేదు. మొత్తంగా అయితే.. ప్రేక్షకులలో ఆసక్తి పెంచడానికి బిగ్ బాస్ చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారనేది మాత్రం.. ఈ నామినేషన్లను చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు