Vijayawada Hotel: హోటల్స్ లో చెప్పిన ఫుడ్ ఆర్డర్స్ మారుతుండటం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఒకటి ఆర్డర్ ఇస్తే హోటల్ స్టాఫ్ మరొక ఫుడ్ ను తీసుకురావడం అడపా దడపా చూస్తూనే ఉంటాం. ఈ విషయాన్ని స్టాఫ్ కు తెలియజేయగానే వారు తప్పును సరిదిద్దుకొని చెప్పిన ఆర్డర్ ను తీసుకోస్తారు. కానీ విజయవాడలోని ఓ హోటల్లో ఇలా జరగలేదు. ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్ పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
విజయవాడలోని వెల్ కమ్ హోటల్లో శనివారం (సెప్టెంబర్ 13) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ కోసం హోటల్ వద్దకు వచ్చిన అబ్దుల్ కరీం.. ఉప్మా దోశ ఆర్డర్ చేశాడు. స్టాఫ్ దోశను పార్సిల్ చేసి ఇవ్వడంతో డబ్బులు చెల్లించి ఇంటికి తీసుకెళ్లాడు. తీరా ఫుడ్ ప్యాకెట్ ను తెరిచి చూడగా.. ఉప్మా దోశకు బదులు ప్లెయిన్ దోశ దర్శనమిచ్చింది. దీంతో తిరిగి హోటల్ వద్దకు వచ్చిన అబ్దుల్.. చెప్పిన ఆర్డర్ కాకుండా మరొకటి ఇచ్చారని హోటల్ సిబ్బంది తెలియజేశాడు.
Also Read: Viral Video: ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. కోర్టు ఆవరణలోనే చెప్పుతో కొట్టిన భార్య.. వీడియో వైరల్
మాటా మాటా పెరిగి దాడి
అయితే దోశ ఆర్డర్ మారిందన్న విషయంలో అబ్దుల్, హోటల్ స్టాఫ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో హోటల్ స్టాఫ్.. అబ్దుల్ కరీంపై కత్తితో దాడి చేశారు. దీంతో అబ్దుల్ మెడపై తీవ్రగాయమై తీవ్రంగా రక్తస్రావమైంది. వేసుకున్న టీషర్ట్ రక్తంతో తడిచిపోయింది. దీంతో అబ్దుల్ బంధువులు.. హోటల్ స్టాఫ్ ను నిలదీశారు. దాడి అనంతరం అబ్దుల్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ వీడియో చిత్రీకరించారు. తప్పు ఆర్డర్ ఇచ్చారని చెప్పినంత మాత్రాన దాడి చేస్తారా అంటూ ఓ వ్యక్తి హోటల్ స్టాఫ్ ను నిలదీయడం వీడియోలో చూడవచ్చు. కాగా విజయవాడ పోలీసులు దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని అడిగినందుకు కత్తితో దాడి
శనివారం రాత్రి విజయవాడ వెల్కమ్ హోటల్లో ఉప్మా దోశ ఆర్డర్ చేసిన అబ్దుల్ కరీం, ఏంటికి వెళ్లిచూడగా ప్లెయిన్ దోశ ఉండడంతో. తిరిగి హోటల్ కు తీసుకొచ్చి అడగగా మాటలు పెరిగి, సిబ్బంది కత్తితో గాయపరిచారు. #Vijawada pic.twitter.com/JOda2OjPiX
— Swetcha Daily News (@SwetchaNews) September 15, 2025