almonds ( Image Source: Twitter)
Viral

Almonds: బాదం తొక్కతో తినాలా.. తొక్క తీసేయాలా? షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు

Almonds: బాదంపప్పు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వినగానే కొందరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. బాదంపప్పు అంటే ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్, దీన్ని “పప్పుల రాజు” అని పిలుస్తారు.వైద్యులు కూడా బాదం పప్పులను తినమని చెబుతారు. దీనిని తినడం వలన మన మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుందని చెబుతుంటారు. మనలో చాలా మంది ఉదయాన్నే నానబెట్టిన బాదాన్ని తింటుంటారు. అయితే, ఇక్కడే ఓ సందేహం కూడా ఉంది. అది ఏంటంటే.. బాదం పప్పును తినేటప్పుడు కొందరు తొక్కతోనే తింటారు. ఇంకొందరు తొక్కను తీసి తింటారు? అసలు తొక్క తీసి ఉంటారా? లేక తొక్క తోనే తింటారా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: Jangaon Politics: జనగామ రాజ‌కీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!

తొక్కతో బాదం తినడం వల్ల లాభాలు

బాదంపప్పు కేవలం గింజలోనే కాదు, దాని తొక్కలో కూడా అద్భుతమైన పోషకాలు దాగి ఉన్నాయి. బాదంలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ, బాదం తొక్క ఒక శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్ కవచంలా పనిచేస్తుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.  అంతేకాదు, తొక్కతో బాదం తినడం వల్ల శరీరానికి అధిక ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను చెక్ పెడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే, ఆరోగ్య సమస్యలు లేని వారు, సంపూర్ణ శారీరక ఫిట్‌నెస్ ఉన్నవారు బాదంను తొక్కతో తినడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: Siddaramaiah: హిందూ సమాజంపై సంచలన ప్రశ్నలు సంధించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

తొక్క తీసేసి తినడం మంచిదేనా?

బాదం తొక్క అందరికీ ఒకే లాంటి ప్రయోజనం కలిగించకపోవచ్చు. కానీ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి బాదం తొక్కను అరిగించుకోవడం కష్టమవుతుంది. ఇది కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలకు దారితీయొచ్చు. బాదం తొక్కలో టానిన్ అనే రసాయనం ఉంటుంది, ఇది శరీరం బాదంలోని పోషకాలను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకోవచ్చు. బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం తొక్కను తొలగించడం వల్ల ఈ టానిన్ పోషకాలను అడ్డుకునే సమస్య తొలగిపోతుంది.

Also Read: HCA Fund Misuse: హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయని జగన్ మోహన్​ రావు.. వెలుగులోకి మరో సంచలనం..?

Just In

01

Memory Improvement: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన హెల్త్ టిప్స్

Hydraa: నాటి నిందలే నేటి ఫలితాలు.. హైడ్రాకు జనం నీరాజనాలు

Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!

Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..