Ind Vs Pak Match: పాకిస్థాన్‌పై స్పిన్నర్ల హవా.. టార్గెట్ ఎంతంటే?
India-Vs-Pak-Score
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Ind Vs Pak Match: పాకిస్థాన్‌పై చెలరేగిన స్పిన్నర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

Ind Vs Pak Match: ఆరంభంలో పేసర్లు అదరగొట్టగా.. పాకిస్థాన్ మిడిలార్డర్‌ను (Ind Vs Pak Match) భారత స్పిన్నర్ల కుప్పకూల్చారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇద్దరూ కలిసి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. కుల్దీప్ యాదవ్ కీలకమైన 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి పాకిస్థాన్ మిడిలార్డర్‌ను పెవీలియన్‌కు పంపించారు.

ఇక, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. దీంతో, దాయాది దేశం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. దీంతో, భారత్ టార్గెట్ 128 పరుగులుగా ఉంది.

పాక్ బ్యాటర్ల స్కోర్లు

పాకిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (40) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సైమ్ అయూబ్ (0), మొహమ్మద్ హారిస్ (3), ఫకర్ జమాన్ (17), సల్మాన్ ఆఘా (3), హసన్ నవాజ్ (5), మొహమ్మద్ నవాజ్ (0), ఫహీమ్ అష్రఫ్ (11), షాహిన్ అఫ్రిదీ (33, నాటౌట్), సుఫియాన్ ముఖీం (10), అబ్రార్ అహ్మద్ (0, నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.

Read Also- IND vs PAK Match: ఆరంభంలో పాక్‌ను బెంబేలెత్తించిన పాండ్యా, బుమ్రా.. టాస్ సమయంలో ఊహించని సీన్లు

పాక్ జాతీయ గీతానికి బదులు వేరే సాంగ్..

ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాల సమయంలో వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జాతీయ గీతం బదులు నిర్వాహకులు పొరపాటుగా వేరే సాంగ్‌ను ప్లే చేశారు. దీంతో, పాక్ క్రికెటర్లు కొంతసేపు గందరగోళానికి గురయ్యారు. అయోమయంగా కనిపించారు. అయితే, నిర్వాహకులు వెంటనే తప్పును గుర్తించి, అసలు జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌ను పలకరించలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు.

Read Also- Ind vs Pak Match: దుబాయ్ స్టేడియానికి హై సెక్యూరిటీ.. ఫ్యాన్స్‌కు అనూహ్య రూల్స్!

దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు..

భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే సాధారణంగా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. టికెట్లు సేల్‌కు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిపోతుంటాయి. మైదానం ఎక్కడైనా సరే అభిమానులు పోటీ పడి మరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 14) జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌లో పరిస్థితి భిన్నంగా కనిపించింది. మ్యాచ్ సమయంలో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అనేక ఖాళీ సీట్లు కనిపించాయి. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసింది. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ, ఈసారి స్టేడియంలో ఖాళీ సీట్లు కనిపించడం వెనుక రాజకీయ ఉద్రిక్తతలు, మ్యాచ్ బహిష్కరణ డిమాండ్లు కారణం కావొచ్చనే నిపుణులు భావిస్తున్నారు.

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!