KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆనాడు రాళ్లతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉంటే నేడు మీ చెంతన చేరిన ఎమ్మెల్యేలను దేనితో కొట్టాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిఆర్ఎస్(BRS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు(KTR) వ్యాఖ్యానించారు. గద్వాల జిల్లా కేంద్రంలో ర్యాలీ అనంతరం తేరు మైదానంలో జరిగిన గద్వాల గర్జన బహిరంగ సభలో గద్వాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బి.ఎస్ కేశవ్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, ధరూర్ మాజీ జడ్పిటిసి(ZPTC) పద్మా వెంకటేశ్వర్ రెడ్డి(Padma Venkateswara Reddy), మాజీ సర్పంచులు పార్టీలో చేరికలు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ గా ఉందని వారిపై వేటు వేయక తప్పదని, రానున్న రోజులలో ఉప ఎన్నికలు తథ్యమన్నారు.
గొప్పలు చెప్తున్న ముగ్గురు మంత్రులు
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గద్వాల ముందు వరుసలో ఉందని, ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులని మరో 9 నెలల్లో గద్వాలలో ఉప ఎన్నిక ఖాయమని, అదే స్ఫూర్తితో నిలబడనున్న బీసీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. నూతన జిల్లాగా జోగులాంబ గద్వాల జిల్లాను కెసిఆర్ ఏర్పాటు చేశారన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)కు నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్, 1275 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆనాడు కేసీఆర్(KCR) ఇస్తే నేడు వాటికి రంగులు మార్చి ఇందిరమ్మ ఇల్లుగా గొప్పలు చెప్పుకుంటూ ముగ్గురు మంత్రులు వచ్చి లబ్ధిదారులకు ఇచ్చారన్నారు. కెసిఆర్(KCR) హయంలో అలంపూర్ నియోజకవర్గంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు ఇస్తే, గట్టు, కేటి దొడ్డి మండలాలను వెనుకబడిన ప్రాంతంగా భావించి బీడు భూములను సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు గట్టు మండలంలో గట్టు ఎత్తిపోతల పథకాన్ని మా హాయంలో 40 శాతం పూర్తి చేయగా నేటికి ఆ ఎత్తిపోతల పథకం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే పడిందన్నారు.
Also Read: Vishnu Manchu: తమ్ముడు మనోజ్ సినిమాకి మంచు విష్ణు ట్వీట్
బంగారు పళ్లెంలో పెట్టిస్తే..
కాంగ్రెస్(Congress) ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అవి అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అభివృద్ధి పేరుతో వారి చెంతన చేరిన గద్వాల ఎమ్మెల్యే ఏం సాధించారన్నారు. ఎంపీ(MP) ఎన్నికలప్పుడు పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) వైయస్సార్ చౌక్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్(Congress) లో చేరే కన్నా రైలు కింద తల పెట్టుకొని చావడం మంచిదని వ్యాఖ్యానించారని, నేడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పంచన ఎందుకు చేరారన్నారు. తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టిస్తే నేడు దివాలా తీసిన రాష్ట్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడన్నారు. యూరియా(Urea) కొరతతో పాటు రైతులకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
పార్టీ మారిన 10 ఎమ్మెల్యే స్థానాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. గద్వాలకు అభివృద్ధికి ఎమ్మెల్యే ఏం సాధించారని, ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయని అన్నారు. కరోనా కష్ట కాలంలో సైతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పథకాలను అమలు చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ వాళ్లకే దక్కుతుందన్నారు. సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి(Venkatram Reddy) మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్(SrinivassGoud), లక్ష్మారెడ్డి, ఆంజనేయులు గౌడ్, కురువ విజయ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విజయుడు,మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Also Read: Ramchander Rao: ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాలు లేక.. ఇబ్బందుల్లో కేబుల్ ఆపరేటర్స్!
