Hydraa: పాతబస్తీలో రెండు రోజుల క్రితం జరిగిన డ్రెయిన్ లో చిన్నారి పడిన ఘటనపై హైడ్రాపై కొందరు బ్లేమ్ గేమ్స్ ఆడారని, అలాంటి సంఘటనలు జరగకుండా హైదరాబాద్(Hyderabad) జనజీవనంతో సంబంధమున్న అన్ని విభాగాలు కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని, ఆ ఘటనకు ఒక వేళ హైడ్రా(Hydraa) వైఫల్యమని తేలితే, దాన్ని తప్పకుండా స్వీకరిస్తామని కూడా హైడ్రా కమిషనర్ రంగనాధ్(Commissioner Ranganath) క్లారిటీ ఇచ్చారు. ఘటనపై ఆయన శుక్రవారం హైడ్రా ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ హైడ్రా జీహెచ్ఎంసీలో ఒక భాగమని, సిటీలో జనజీవనాన్ని నేరుగా ప్రభావితం చేసే విభాగాల్లో జీహెచ్ఎంసీ బిగ్ బ్రదర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
తమ లోపాలను కూడా..
హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఎన్నో ఆక్రమణలను తొలగించి, వేల కోట్ల రూపాయల విలువైన భూమలకు విముక్తి కల్గించామని, వ్యక్తిగతంగా కాకుండా ఎన్నో కాలనీలకు చెందిన అనేక రకాల సమస్యలు పరిష్కారమయ్యాయని, పాజిటీవ్ రెస్పాన్స్(Positive response) ను స్వీకరించిన విధంగానే తమ లోపాలను కూడా స్వీకరించే హైడ్రా సరిదిద్దుకుని ముందుకెళ్తుందని, పాతబస్తీ ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అంటూ ఏమీ ఉండదని, నేరుగా చర్యలే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. హైడ్రాకు సర్కారు మంజూరు చేసిన 169 స్టాఫ్ ప్యాట్రన్ లో ఇంకా సగం మంది సిబ్బంది రావల్సి ఉందని, మున్ముందు అవసరాలకు తగిన విధంగా టెక్నాలజీని కూడా సమకూర్చుకుని హైడ్రా మరింత సామర్థ్యంతో విధులు నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం సర్కారు హైడ్రాకు కేటాయించిన రూ. వంద కోట్లలో ఇప్పటికే మొదటి త్రైమాసిక వాటా రూ.25 కోట్లు విడుదలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Vivek Venkataswamy: రాష్ట్రంలో రెడ్ క్యాట్ కంపెనీలకు నోటీసులు ఇస్తాం: మంత్రి వివేక్!
యాకుత్‌పురా ఘటనకు బాధ్యులపై హైడ్రా యాక్షన్
పాతబస్తీలోని యాకుత్‌పురా డివిజన్ మౌలాకా చిల్లాలోని మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన ఘటనలో డీఆర్ ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరు, మెట్ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) సిబ్బంది ఇద్దరి నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్ధారించింది.
జలమండలి అధికారులతో..
డీఆర్ఎఫ్(DRDF) సూపర్‌వైజర్లు ఇద్దర్ని డిమోష్ చేయటంతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ సిబ్బంది (మెట్)కి చెందిన ఇద్దరినీ విధుల్లో నుంచి తొలగించాలని ఆ టీమ్ కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు హైడ్రా గురువారం వెల్లడించింది. నగరంలో అన్ని క్యాచ్‌పిట్లపైనా మ్యాన్ హోల్ మూతలుండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఒక వేళ ఎక్కడైనా మూతల్లేకుంటే సంబంధిత శాఖలైన జీహెచ్ఎంసీ(:్ఛఢ), జలమండలి అధికారులతో సంప్రదించి వాటిపై మూతలు వేసేలా చర్యలు తీసుకోవాలని హైడా సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. ఒక వేళ ఎక్కడైనా పొరపాటున మ్యాన్ హోల్ మూత తెరచి ఉంటే వెంటనే 9000113667 నంబరుకు ఫోను చేసిన సమాచారమివ్వాలని హైడ్రా నగరవాసులను కోరింది.
Also Read: Revanth Reddy: మన ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి