Revanth Reddy: మన ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన..
Revanth Reddy ( IMAGE credit: swetcha reporter)
Telangana News

Revanth Reddy: మన ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy: మన ప్రజాపాలన ప్రగతి వైపుకు తెలంగాణ పయనం అనే పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ తన నివాసంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి(Dr. Rajesh Reddy)తో కలిసి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు ముచ్చర్ల దినకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddyకి పుస్తకాన్ని అంకితం ఇచ్చారు.

 Also Read: Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

సంక్షేమంలో దూసుకుపోతున్నది 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 20నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఆభివృద్ది, సంక్షేమంలో దూసుకుపోతున్నదని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం చెపట్టిన కార్యక్రమాలను పుస్తక రూపంలో తీసుకురావాడాన్ని అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో 7 డిసెంబర్ 2023న ఏర్పడ్డ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడింది. ఆనాటి నుండి చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయడం కోసం 18 నెలల పాలనపై వివిధ పత్రికల్లో రాసిన 18 వ్యాసాలతో ఒక పుస్తకంగా ప్రచురించడం జరిగింది.

బీసీ డిక్లరేషన్ బిల్లు తెలంగాణ చారిత్రక నిర్ణయం

ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఎల్ ఓ పి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా దేశంలో కులగణనకోసం తెలంగాణ ప్రభుత్వం ముందు వరసలో నిలబడింది. దేశానికే దిక్సూచి తెలంగాణలో కులగణన, బీసీ డిక్లరేషన్ బిల్లు తెలంగాణ చారిత్రక నిర్ణయం తోపాటు మూడు దశాబ్దాల పోరాటం ఎస్సీ వర్గీకరణ అమలు, యంగ్ ఇండియా, వరి పంట బోనస్, పాటకు పట్టాభిషేకం, మామ్మనూరు ఎయిర్ పోర్టు, మూసి మణిహారం, హైడ్రాను స్వాగతిస్తున్న తెలంగాణ, కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా తేల్చాల్సిందే, ప్రపంచ అందాల పోటీలు తోపాటు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ పుస్తకంలో తెలియజేశారు.

 Also Read: Tummala Nageshwar Rao: భారత్-ఆఫ్రికా మధ్య వ్యవసాయ రంగం బలోపేతం!

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..