Tummala Nageshwar Rao: తెలంగాణ భారతదేశపు సీడ్ హబ్(Seed Hub) గా మారిందని, దేశ అవసరాల్లో 60% విత్తనాన్ని తెలంగాణ నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Mi Tummala Nageshwar Rao) తెలిపారు. 1000కు పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్(Global) గుర్తింపు లభించిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025 లో పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయానికి భవిష్యత్తులో
ఈ సమ్మిట్ భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కేవలం వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమా(Seed Diploma) ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయానికి భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం కోసం ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తుందని వెల్లడించారు. భారత్ గ్రీన్ రివల్యూషన్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించిందని, ఆ విజయానికి మూలం నాణ్యమైన విత్తనం అని, నాణ్యమైన విత్తనమే లేకపోతే పంట లేదు అలాగే రైతు ప్రగతి సాధ్యం కాదన్నారు.
Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్సే ఇంత వైలెంట్‌గా ఉన్నాయేంట్రా బాబు..?
నాణ్యమైన విత్తనాల వినియోగం
ఆఫ్రికా ఖండంలో మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలు పండుతున్నప్పటికీ, రైతులు దాచుకున్న పంటలో కొంత ధాన్యాన్ని విత్తనంగా వాడుతున్నారని, ఇది ఉత్పాదకతను తగ్గించే అంశమని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు భరోసా విధానాన్ని వివరించారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Bunny Vas: ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం!