India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌కు (India vs Pakistan) ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరిగే ప్రతిసారీ ఫ్యాన్స్‌కు క్రికెట్ ఫీవర్ పట్టుకుంటుంది. దాయాదుల మధ్య మ్యాచ్‌కు ఇంత ప్రత్యేకత ఉండడానికి కేవలం క్రికెట్ మాత్రమే కారణం కాదు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం, ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆసియా కప్-2025లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాయి. అయితే, ఉగ్రవాదులకు, ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడడం ఎందుకు?.. అంటూ తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకొని భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన పంజాబ్ కింగ్స్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే అభిప్రాయాన్ని వినూత్నంగా వ్యక్తపరుస్తూ ఒక ఫొటో షేర్ చేసింది.
Read Also- Khammam District: చేసేది ప్రభుత్వ ఉద్యోగం.. కానీ సెటిల్మెంట్ లక్ష్యం.. ఇంతకీ ఎవరు..?
పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసిన ఆ పోస్టులో ఆసియా కప్‌లో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న ఆడనుందని ఉంది. కానీ, ఆ మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పేరును మాత్రం ఫొటోలో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. భారత్-పాక్ మ్యాచ్‌పై పెద్దఎత్తున చర్చలు కూడా తెరతీసింది. దీంతో, పంజాబ్ కింగ్స్ జట్టు ఈ ఎక్స్ పోస్టుకు కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేసింది.
కాగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిగణించాల్సిన అవసరం లేదని జడ్జిలు తిరస్కరించారు. ‘‘ దేశాల మధ్య జరిగే క్రికెట్ స్నేహం, ఐక్యతను చాటేందుకు ఉపయోగపడాలి. కానీ, ఫహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లలో మనవాళ్లు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. మన సైనికులు ప్రాణ త్యాగం చేస్తుంటే, మనం అదే దేశంతో ఆటలు ఆడుతున్నామనే సందేశం వెళుతుంది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు.
Read Also- Shocking Incident: పాతబస్తీలో దారుణం.. మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఐదేళ్ల చిన్నారి.. చివరికి..?
పాక్ ఉగ్రవాదుల కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయినవారి మనోభావాలను భారత్-పాక్ మ్యాచ్ దెబ్బతీసే అవకాశం ఉందని, దేశ గౌరవం, ప్రజల భద్రత కంటే వినోదం ముఖ్యంకాదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు, సైనికుల మానసిక స్థితికి విరుద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, ఆసియా కప్ -2025లో భారత్, పాకిస్థాన్ జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి.
Game 2️⃣ for the defending champions. Let's goooo 💪#AsiaCup2025 #INDv pic.twitter.com/BgeoRfJjMo
— Punjab Kings (@PunjabKingsIPL) September 11, 2025