Khammam District: ఆమె సాదాసీదా లేడీ కాదు. తమ కుటుంబ అవసరాల నేపథ్యం కోసమే ఉద్యోగం పొందింది. చేసేది మాత్రం అక్రమ కార్యకలాపాలు, దండాలు మాత్రమే. పై అధికారులను బుట్టలు వేసుకొని వారికి సింపతి చూపించి జాగ్రత్త పడడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇదే కాబోలు ఆమెను ఉద్యోగం నుంచి కాపాడుతుండడంలో అతిశయోక్తి లేదు. ఆమెలో మరో కోణం ఉంది. ఆమె చేసేది ప్రభుత్వ ఉద్యోగమైన నిత్యం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యాపారాలు చేయడం. అసైన్డ్ భూముల(Assigned lands)లో తనదైన శైలిలో ముందుకు సాగడం ఆమెలో దాగి ఉన్న నైజం. దానికి ఆమె భర్తను ఉసిగొల్పడం క్యాస్ట్ కార్డుతో ఇతర సామాజిక వర్గాలను బెదిరించడం నిత్య కృత్యంగా సాగుతుంది. అయ్యో పాపం కల్లాకపటం లేని మహిళ ఉద్యోగి అని డాబురించడంలో ఆమెకి ఆమె సాటి.
వేంసూర్ ఎమ్మార్వో కార్యాలయం
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన లేడి. అదే ఆయుధంతో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా వేంసూర్(Vemsur) తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తుంది. ఆమె చేస్తున్న అక్రమాలకు నేటికీ విచారణకు సంబంధిత అధికారులు స్పందించడంలో విఫలమయ్యారు. అక్రమ పద్ధతిలో క్రైమ్ పొందిన భూములను వారసత్వ భూములుగా చూపే ప్రయత్నం చేసిన ఆమె. పై అధికారులను మభ్య పెట్టడంలో మాయ చేస్తోంది. అమాయక సింపతితో అధికారులను కట్టడి చేస్తోంది. అయితే ఇదే విషయంలో పలుమార్లు కొంతమంది సామాజిక బాధ్యులు ప్రశ్నించినప్పటికీ సంబంధిత తహసిల్దార్ స్పందించకపోవడం గమనర్హం. కిందిస్థాయి ఉద్యోగినిని కాపాడాడమే దుశ్చర్యగా పెట్టుకున్నారు. ఆమె చేస్తున్న అక్రమాలకు విచారణ చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ లక్ష్యానికి మోక్షం ఎప్పుడు తెలియకుండా వ్యవహరిస్తుండడం విశేషం. ఆమెపై ఎప్పుడూ చర్యలు తీసుకుంటారోనని ప్రైవేట్ వ్యక్తులు మండల నాయకులు ఆతృతక ఎదురుచూస్తున్నారు. అంటే ఆమె చేస్తున్న అక్రమాలు ఎక్కడి వరకు వెళ్లాయో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. జూనియర్ అసిస్టెంట్(Junior Assistant) గా పనిచేస్తున్న కోలా బేబీ(Koala baby) పై భూకంభకోణం ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి.
Also Read: Man Kills Wife: ప్రియుడితో దొరికిన భార్య.. తలలు తెగ నరికి.. బైక్‌కు కట్టుకెళ్లిన భర్త
ఉద్యోగ జీవిత ప్రారంభంలోనే అక్రమాలకు
తన ఉద్యోగ జీవితంలో ప్రారంభంలోని ఎర్రకుంట(Errakunta) గ్రామంలో 2014 సంవత్సరంలో వీఆర్ఏ(VRO) గా చేరి భూ రికార్డులను తారుమారు చేసిన ఘనత ఆమెది. తన సొంత మామయ్య పేరుపై ఉన్న కహాని రికార్డుల్లో మూడు ఎకరాల పట్టాదారిగా ఎంటర్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 2018లో జూనియర్ అసిస్టెంట్ తన భర్తతో కలిసి అసైన్మెంట్ భూములు(Assignment lands) కొనుగోలు చేసినట్టు తప్పుడు ఆధారాలతో పట్టాదారు పాసుబుక్కు పొందినట్లుగా స్పష్టమైనది.
అసలు పట్టాదారుల పేర్లు మాయం
2010 నుండి 2016 2017 వరకు పట్టాదారుల పేర్లు స్పష్టంగా ఉండగా, 2018లో ఈమె, ఈమె భర్త చెన్నారావు అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఆ భూములను వారసత్వ భూములుగా చూపించిన ఘనతలో ఆమె తన నైపుణ్యతను ప్రదర్శింపజేసింది. సంబంధిత భూములపై సాదా బైనమా 13 బిట్టాలు లేవని నాయబ్ తహసిల్దార్(MRO) ఆర్టిఏ(RTA) సమాధానం ఇవ్వడం ద్వారా ఈ వ్యవహారాన్ని మరింత బహిర్గతం చేసింది.
రికార్డు ప్రకారం అక్రమంగా పొందిన భూముల వివరాలు
1.సర్వే నెంబర్ 195/అ కోలా చెన్నారావు -0.09 గుంటలు
2.సర్వేనెంబర్ 256 /53/ర్/1 కోలా చెన్నారావు 1-00
3.సర్వే నెంబరు 192/ఆ/2 ఓలా చెన్నారావు 0.07 గుంటలు
4.సర్వేనెంబర్ 192/ఆ కోలా చెన్నారావు 0.07 గుంటలు
5.సర్వేనెంబర్ 256/81/అ/1/2 కోలా చెన్నారావు 0.11 గుంటలు
సర్వే నెంబరు 343 కోలా చెన్నారావు 0.18 గుంటలు
7.సర్వేనెంబర్ 256/21 కోల వెంకటేశ్వరరావు 3.00 ఎకరాలు
రికార్డు ప్రకారం 2010 నుండి 2016/17 కాలంలో ఉన్న అసలు పట్టాదారు వివరాలు
1.సర్వేనెంబర్ 256/81/అ/1/2 మామిళ్లపల్లి కళావతి 0.11 గుంటలు
2.సర్వే నెంబర్ 256/21 షేక్ రహీం 3. సర్వే నెంబర్ 343 అల్వాల శ్రీరామచంద్రారావు 0.18 గుంటలు
4 సర్వేనెంబర్ 292/అ వాసం వీర వెంకయ్య 0=07 గుంటలు
5.సర్వే నెంబరు 292/అ/2 వాసం వీర వెంకయ్య0=07 గుంటలు
6.సర్వే నెంబర్ 195/ఆ చిలక పేరప్ప0- 09 గుంటలు
7 సర్వే నెంబర్ 256/ర్/1 చిలక రమాదేవి 1.00 ఎకరం రికార్డుల్లో ఉన్నాయి
ఆర్టిఐ(RTI) ప్రకారం అసైన్డ్ భూములను ప్రభుత్వ ఉద్యోగులు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కొనుగోలు చేస్తే తీవ్ర నేరం పరిగణలోకి వస్తుంది. ఈ విషయం స్థానిక తహసిల్దార్(MRO) కు తెలిసినప్పటికీ మిన్న కుండి పోతుండడంలో అంతర్యం ఏంటో అర్థం కావడం లేదు.
Alsom Read: New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి
చట్టం ఏమి చెప్తుంది?
అసైన్‌మెంట్ భూములు (ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూములు) ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదు, బదిలీ చేయరాదు, తాకట్టు పెట్టరాదు. ఓకవేల కొనుగోలు చేస్తే ఆ లావాదేవీ చెల్లదు, భూమి తిరిగి ప్రభుత్వానికి వెళ్తుంది. POT చట్టం – 1977 ప్రకారం, అసైన్‌మెంట్ భూమి కొనుగోలు/అమ్మకం నేరంగా పరిగనిస్తారు.
ఉద్యోగులపై ప్రత్యేక నిబంధనలు
ప్రభుత్వ ఉద్యోగి ఏ భూమి అయినా కొనుగోలు చేయాలంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ముందుగా అనుమతి/సమాచారం ఇవ్వాలి. కానీ అసైన్‌మెంట్ భూములు కొనుగోలు చేయడం చట్టరీత్యా నిషేధం, కనుక అనుమతి ఇవ్వబడదు. ఇలాంటి చర్యలు (Conduct Rules) ఉల్లంఘనగా పరిగణించబడతాయి. ఉద్యోగిపై డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ (Suspension, Removal, Pension benefits) .చేసే అవకాషం ఉంటుంది.
చట్టపరమైన చర్యలు
POT Act – 1977, IPC సెక్షన్లు (Fraud, Cheating, Forgery) కింద కేసులు నమోదు చేయవచ్చు. ఇది Prevention of Corruption Act, 1988 కింద కూడా నేరంగా పరిగణించబడుతుంది.
ప్రజల స్పందన
ఈ సమస్య పై ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా విచారణ జరగకపోవడం దారుణం తహశీల్దార్ కార్యాలయం మౌనం అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగి అధికార దుర్వినియోగం చేస్తే సామాన్య ప్రజల భూముల రక్షణ ఎక్కడ అంటూ అక్కడి స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రజలు అక్రమ పట్టా పాస్ పుస్తకాలకు సహకరించిన అధికారులపై మరియు ఈమె పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Viral Video: బస్సులో రణరంగం.. డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన మహిళ.. అందరూ షాక్!