Shocking Video: అమెరికాలో భారతీయులపై దురాగతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. డల్లాస్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ఆంగ్లేయుడు అతడ్ని వెంటాడి మరి తల నరికేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకకు చెందిన చంద్ర మౌళి నాగమల్లయ్య (50) ఒక మోటెల్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. నిందితుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ (37) కూడా అక్కడే పనిచేస్తున్నాడు. వాషింగ్ మిషన్ విషయంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. పాడైపోయిన వాషింగ్ మిషన్ వాడొద్దని మార్టినెజ్ (Yordanis Cobos Martinez) కు నేరుగా చెప్పకుండా మరొకరి చేత నాగ మల్లయ్య చెప్పించాడు. అయితే తనతో నేరుగా చెప్పకపోవడంతో మార్టినెజ్ ఆగ్రహానికి లోనయ్యాడు.
వెంటాడి మరి తల నరికివేత
తనతో డైరెక్ట్ గా మాట్లాడకుండా మహిళా ఉద్యోగితో చెప్పించడమేంటని మండిపడుతూ నాగ మల్లయ్య (Chandra Mouli Nagamallaiah)తో మార్టినెజ్ గొడవపడ్డాడు. వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చడంతో అక్కడే ఉన్న కత్తితో పలుమార్లు నాగమల్లయ్యపై దాడి చేశాడు. దీంతో అతడి బారి నుంచి తప్పించుకునేందుకు నాగమల్లయ్య పార్కింగ్ లాట్ గుండా బయటకు పరిగెత్తాడు. అయితే అతడ్ని వెంటాడి మరి తల నరికి చంపేశాడు. ఆపై తలను ఫుట్ బాల్ లా తన్నాడు. అనంతరం పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేశాడు.
Just look at this video, Chandra Nagamallaiah was so helpless
Justice for #ChandraNagamallaiah @PMOIndia @DrSJaishankar @MEAIndia pic.twitter.com/p86kTvG5hV
— Sajjan Saini (@SajjanNifty) September 12, 2025
Also Read: Mirai Movie Review: మిరాయ్ సినిమా రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా?
భార్య, కొడుకు అడ్డుపడినప్పటికీ..
అయితే దాడి సమయంలో నాగమల్లయ్య భార్య, 18 ఏళ్ల కుమారుడు అక్కడే ఉన్నారు. మార్టినెజ్ ను అడ్డుకునేందుకు వారు ఎంతగానో ప్రయత్నించారు. నిందితుడ్ని వారిని తోసేసి మరి తల నరకడం గమనార్హం. ఆపై తలపై కాలు కూడా పెట్టాడని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు నిందితుడ్ని దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మార్టినెజ్ ను అరెస్ట్ చేశారు.
Also Read: Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ
భారత రాయబార కార్యాలయం ఆగ్రహం
నాగమల్లయ్య విషాదకర మరణంపై భారత కాన్సులేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పని చేసుకుంటున్న చోటనే నాగమల్లయ్యను క్రూరంగా హతమార్చారు. బాధిత కుటుంబంతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అన్ని విధాల సహాయం అందిస్తాం. నిందితుడు ప్రస్తుతం డల్లాస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసు పురోగతిని మేము దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము’ అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. మరోవైపు మార్టినెజ్ పై డల్లాస్ పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. అతడికి గతంలో క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు గుర్తించారు. హ్యూస్టన్‌లో వాహన దొంగతనం, దాడి కేసులలో మార్టినెజ్ నిందితుడిగా ఉన్నాడు.