Mirai Movie Review: మిరాయ్ సినిమా రివ్యూ
మిరాయ్ (Mirai) తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. డైరెక్టర్ కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రీయ సరన్, జయరామ్, జగపతి బాబు లాంటి స్టార్ కాస్ట్‌తో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. హనుమాన్ సక్సెస్ తర్వాత తేజ సజ్జా మరోసారి సూపర్ హీరో రోల్‌లో కనిపించాడు. స్టోరీ అశోక చక్రవర్తి కాలంలోని 9 పవిత్ర గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఇవి మనుష్యుడిని దేవుడిగా మార్చగలవు. విలన్ మహాబీర్ (మంచు మనోజ్) ఈ గ్రంథాలు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. వీడ్హ ప్రజాపతి (తేజ సజ్జా) అవి కాపాడాలని బాధ్యత తీసుకుంటాడు. మిరాయ్ అనేది శ్రీరాముడు త్రేతాయుగంలో తయారు చేసిన ఆయుధం, ఇదే ఈ స్టోరీకి కీలకం.
పాజిటివ్స్:
విజువల్స్ & VFX: 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో VFX చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ట్రైలర్ నుంచి హైప్ ఉండటంతో, సినిమాలో ట్రైన్ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు థియేటర్లో బాంబ్ లాగా పేలాయి. ఇండియన్ మిథాలజీతో మిక్స్ చేసిన విజువల్స్ ప్రౌడ్ ఫీల్ కలిగించాయి.
తేజ సజ్జా పెర్ఫార్మెన్స్: హనుమాన్ తర్వాత మళ్లీ సూపర్ యోధగా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో నటించాడు. యంగ్‌స్టర్ నుంచి హీరోగా ట్రాన్స్‌ఫర్మేషన్ సూపర్. ఎమోషన్స్, యాక్షన్ రెండింటిలోనూ షైన్ చేశాడు. అతని కసి, స్టంట్స్ చూసి మనోజ్ మంచు కూడా ఆశ్చర్యపోయాడని స్టేజ్ పైన చెప్పాడు.
Also Read: DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్
సపోర్టింగ్ కాస్ట్: మంచు మనోజ్ విలన్‌గా ఇంటెన్సిటీ ఇచ్చాడు. శ్రీయ సరన్ ఎమోషనల్ డెప్త్ యాడ్ చేసింది. రితికా నాయక్, జగపతి బాబు లాంటి నటులు సపోర్టింగ్ రోల్స్ లో బాగా నటించారు.
మ్యూజిక్ & BGM: గౌరా హరి BGM థ్రిల్‌ని డబుల్ చేస్తుంది. క్లైమాక్స్‌లో శ్రీరాముడు రెఫరెన్స్‌తో గూస్‌బంప్స్.
స్టోరీ & నరేషన్: మిథాలజీ, హిస్టరీ, మోడరన్ స్టోరీటెల్లింగ్ మిక్స్ ఎంగేజింగ్. ప్రభాస్ వాయిస్ ఓవర్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీ ప్రేక్షకులకు, కిడ్స్ కి బాగా నచ్చుతుంది.
Also Read: Hyderabad Roads: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కృషి చేయాలి.. అభయ్ మనోహర్ సప్రే కీలక సూచనలు
నెగిటివ్స్:
రన్‌టైమ్: 2 గంటల 49 నిమిషాలు కొంచెం లాంగ్. మధ్యలో డ్రాగ్ ఫీల్ అవుతుంది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో హైదరాబాద్ ట్రాక్ చాలా వీక్ గా అనిపించింది.
స్క్రీన్‌ప్లే: కొన్ని స్ట్రెచ్‌లు స్లో, కొంచెం ఎడిటింగ్ టైట్‌గా ఉంటే మరింత బెటర్. కంటెంట్ హైప్‌కి కొంచెం తక్కువ అనిపించవచ్చు.
కొన్ని సీన్స్: హీరో క్యారెక్టరైజేషన్ మొదట్లో కొంచెం అనిపించదు. కానీ, తర్వాత సెటిల్ అవుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా ఒక థ్రిల్లింగ్ ఫాంటసీ అడ్వెంచర్, మిథాలజీ గ్రాండ్‌నెస్‌తో మోడరన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఎంటర్‌టైన్ చేస్తుంది.
రేటింగ్: 3/5