dost-admission
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

DOST Admissions: తొలిసారిగా ప్రభుత్వ కాలేజీల్లోనూ అమలు

12న ఖాళీగా సీట్ల సంఖ్య వెల్లడి
ఈ నెల 15, 16న ప్రభుత్వ కాలేజీల్లో..
18, 19 తేదీల్లో ప్రైవేట్ కాలేజీల్లో సీట్ల ప్రదర్శన

షెడ్యూల్ రిలీజ్ చేసిన ఉన్నత విద్యామండలి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డిగ్రీలో ప్రవేశాలకు ‘దోస్త్’ ద్వారా స్పాట్ అడ్మిషన్లకు (DOST Admissions) ఉన్నత విద్యామండలి మరోసారి అవకాశం కల్పించింది. అయితే, తొలిసారిగా ప్రభుత్వ కాలేజీల్లో ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి గురువారం తెలిపారు. ప్రస్తుతం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని, భవిష్యత్లో కొనసాగించడంపై ఆలోచన చేస్తామని వివరించారు. ఖాళీల భర్తీకి షెడ్యూల్‌ను సైతం ప్రకటించారు. శుక్రవారం వేకెన్సీలను వెబ్ సైట్ https://dost.cgg.gov.in లో ప్రదర్శిస్తామని వెల్లడించారు.

Read Also- Kavitha Politics: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటు చీల్చేందుకు కవిత మాస్టర్ ప్లాన్?

ఈ నెల 15, 16 తేదీల్లో ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పూర్తిగా లోకల్ అభ్యర్థులకే ప్రియారిటీ ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. కాగా, సీట్లు పొందిన విద్యార్థుల డేటాను ఈ నెల 17న ఆయా కాలేజీలు అప్‌లోడ్ చేయాలని సూచించారు. కాగా 18, 19 తేదీల్లో ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇందులో లోకల్‌తో పాటు నాన్ లోకల్ అభ్యర్థులకు సైతం ఛాన్స్ కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ నెల 20న సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్ డేట్ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు జిరాక్స్ సెట్లతో స్పాట్ అడ్మిషన్లకు హాజరవ్వాల్సి ఉంటుందని ఆయన సూచించారు.

Read Also- YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

కాగా, విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కు హాజరయ్యేందుకు రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజుగా పెట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు డిగ్రీలో మొత్తం 1,96,451 మంది చేరారని ఆయన తెలిపారు. ఇందులో అబ్బాయిలు 97,590 మంది, అమ్మాయిలు 98,861 మంది ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి మొత్తం డిగ్రీలో 2,41,936 ఖాళీలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర వివరాలకు https://dost.cgg.gov.in సందర్శించాలని ఆయన సూచించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!