Abhishek-Sharma
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Abhishek Sharma: రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. వరల్డ్ క్రికెట్‌లో తొలిసారి

Abhishek Sharma: ఆసియా కప్‌-2025లో టీమిండియా అద్భుతమైన ఆరంభం అందుకుంది. బుధవారం రాత్రి ఆతిథ్య యూఏఈ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో బోణీ కొట్టింది. 9 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. యూఏఈని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారత బౌలర్లు చెలరేగారు. యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలంలో 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

ఆ తర్వాత 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వచ్చారు. గిల్ 9 బంతుల్లో 20 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. అయితే, మరో ఎండ్‌లో డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు బాది ఔటయ్యాడు. ఇందులో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అభిషేక్ చారిత్రక రికార్డ్ సాధించాడు. భారత్ ఛేజింగ్ మొదలైన అయిన తొలి ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మ సిక్సర్ కొట్టాడు. యూఏఈ బౌలర్ హైదర్ అలీ వేసిన తొలి బంతికే అద్భుతమైన సిక్స్ కొట్టాడు. దీంతో, ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా అభిషేక్ శర్మ చరిత్రలో నిలిచాడు.

Read Also- Nano Banana: గూగుల్ జెమినీలో 3డీ ఇమేజెస్‌ ఆప్షన్.. క్రియేట్ చేయడం చాలా ఈజీ!

అభిషేక్ శర్మ దూకుడుతో యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత సునాయాసంగా ఛేదించింది. కేవలం 4.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరింది. దీంతో, మిగిలివున్న బంతుల పరంగా భారత్ ఒక రికార్డు సాధించింది. ఛేజింగ్‌లో మిగిలివున్న బంతుల పరంగా భారత్‌కు టీ20ల్లో ఇదే అతిపెద్ద విజయంగా నమోదయింది. బౌలింగ్‌లొ కుల్దీప్ యాదవ్ – 4 వికెట్లు, శివం దూబే – 3 వికెట్లు తీయడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

మ్యాచ్‌లో గెలుపు అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ, పిచ్ ఎలా ఉందో చూడాలని అనుకున్నానని, అందుకే, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నట్టు చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా పిచ్‌ను గమనించాలని అనుకున్నానని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు అందరూ చాలా పర్‌ఫెక్ట్‌గా ఆడారని, ఫీల్డింగ్ సమయంలో మంచి పాజిటివ్ యాటిట్యూడ్, ఎనర్జీ కావాలనుకున్నామని, తమ ఆటగాళ్లలో అది 100 శాతం కనిపించిందని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటీవల తమ జట్లులోని చాలామంది ఆటగాళ్లు ఇక్కడికి వచ్చారని, ఇక్కడి కండిషన్లు వారికి బాగా తెలుసునని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

Read Also- CRPF: రాహుల్ గాంధీపై సీఆర్‌పీఎఫ్ విమర్శలు.. మల్లికార్జున ఖర్గేకి లేఖ

‘‘పిచ్ బాగానే ఉంది. కానీ, కొంచెం నెమ్మదిగా అనిపించింది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఇక్కడి వాతవరణం చాలా వేడిగా ఉంది. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హార్దిక్, దూబే, బుమ్రా నుంచి మంచి సపోర్ట్ లభించింది. అభిషేక్ శర్మ విషయానికి వస్తే, అతడు ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ ఎందుకయ్యాడని స్పష్టంగా తెలుస్తోంది. టార్గెట్ ఎంత ఉన్నా సరే, అది 200 పరుగులే గానీ, 50 గానీ తొలి బంతి నుంచే మొదలుపెడతాడు. అభిషేక్ శర్మ ఆట నిజంగా అసాధారణం. ఇక అందరి దృష్టి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పైనే ఉంది. అందరూ ఉత్సాహంగా ఉన్నారు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

 

Just In

01

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

Kavitha Politics: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటు చీల్చేందుకు కవిత మాస్టర్ ప్లాన్?

Chai Waala: ‘చాయ్ వాలా’ ‘సఖిరే..’ని చూశారా.. మెలోడీ అదిరింది