Hyderabad SHE Teams: అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 అరెస్ట్
Hyderabad SHE Teams ( IMAGE credit: twitter)
హైదరాబాద్

Hyderabad SHE Teams: గణేష్ ఉత్సవాలు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 మంది పోకిరీల అరెస్ట్

Hyderabad SHE Teams: లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో పాల్గొన్న వినాయక చవితి వేడుకల్లో మహిళలు యువతుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన 1,612మంది పోకిరీలను హైదరాబాద్​ షీ టీమ్స్​(Hyderabad She Teams) పట్టుకున్నాయి. హిడెన్​ కెమెరాలతో ఈ జులాయిల వెకిలి చేష్టలను రికార్డు చేసి మరీ అదుపులోకి తీసుకోవటం గమనార్హం. ప్రతీసారిటానే ఈ యేడాది కూడా హైదరాబాద్ లో గణేశ్​ పండుగ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వందలాది సంఖ్యలో ఏర్పాటైన మంటపాల్లో భిన్న రూపాల్లో కొలువైన అశేష భక్త జనం నుంచి పూజలు అందుకున్నాడు. ఇక, ఖైరతాబాద్ బడా గణేశ్​ పండుగల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్షలాది మంది విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకున్నారు.

 Also Read: Nepal Interim Government: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎలక్ట్రికల్ ఇంజనీర్.. ఎవరీ కుల్మన్ ఘిసింగ్?

కాగా, లక్షలాది మంది పాల్గొనే చవితి వేడుకలు, మహా నిమజ్జన యాత్రలో పోకిరీలు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన ఉమెన్ సేఫ్టీ వింగ్​ డీసీపీ డాక్టర్ లావణ్య(​ DCP Dr. Lavanya)షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దింపారు. వీరికి హిడెన్​ కెమెరాలను కూడా అందించారు. ఎక్కడ పోకిరీలు వెకిలి చేష్టలకు పాల్పడుతూ కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన షీ టీమ్స్ బృందాలు వేర్వేరు చోట్ల 1,612 మంది జులాయిలను అరెస్ట్ చేశారు.

మహిళలు, యువతుల పట్ల అభ్యంతరకరంగా

వీరిలో 1,544మంది మేజర్లు ఉండగా 68మంది మైనర్లు ఉన్నారు. వీరిలో 18 సంవత్సరాల వయసులోపు వారు 68మంది ఉండగా 18 నుంచి 20యేళ్ల వయసులోపు వారు 290మంది ఉన్నారు. 21 నుంచి 30 సంవత్సరాల లోపు వయసువారు 646 మంది, 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారు 397 మంది ఉన్నారు. ఇక, 41 నుంచి 50 మధ్య వయసున్న వారు 166 ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే మహిళలు, యువతుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ 50 సంవత్సరాల పై వయసు ఉన్నవారు 45మంది పట్టుబడటం. 168 పెట్టీ కేసులు నమోదు చేయగా 70 కేసుల్లోని నిందితులను ఆయా కోర్టుల్లో హాజరు పరిచారు. వీటిలో 59మంది కేసుల్లోని నిందితులకు కోర్టులు జరిమానాలు విధించాయి. ఓ కేసులోని నిందితునికి 2 రోజుల జైలు శిక్ష కూడా పడింది.

 Also Read: Telugu Reality Show: సామాన్యులకు బంపరాఫర్.. ఆ రియాలిటీ షోలో గెలిస్తే 10 లక్షలు మీ సొంతం!

వాహనాల దొంగలు అరెస్ట్..  5 టూ వీలర్లు స్వాధీనం

వాహనాలను తస్కరిస్తున్న ఇద్దరిని టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.50లక్షల విలువ చేసే అయిదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్​ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకి సమతా కాలనీ నివాసి మీర్​ మిరాజ్​ హుస్సేన్​ కు చెందిన యమహా బైక్ అతని ఇంటి ముందు నుంచి ఇటీవల చోరీకి గురైంది. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు టోలీచౌకీ సీఐ రమేశ్​ నాయక్​, అదనపు సీఐ బాల్​ రాజ్, ఎస్​ఐ రాఘవేంద్రతోపాటు క్రైం టీం పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు.

టోలీచౌకీ చౌరస్తా వద్ద తస్కరించిన యమహా బైక్ పై వెళుతున్న హకీంపేట కుంట వాస్తవ్యులు సంకురు విజయ భాస్కర్ రెడ్డి (23), ప్రవీణ్​ కుమార్​ (17)లను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ఇద్దరు కలిసి మరో నాలుగు టూ వీలర్లను కూడా అపహరించినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, టోలీచౌకీ క్రైం టీం పోలీసులు పది మంది పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేశారు.

 Alao Read: Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..