GHMC Commissioner ( IMAGE credit: swetcha REPORTER)
హైదరాబాద్

GHMC Commissioner: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం

GHMC Commissioner: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలను ముమ్మరం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్(GHMC Commissioner) ఆర్.వి. కర్ణన్(RV Karnan) సిబ్బందిని, అధికారులను ఆదేశించారు.  శేరిలింగంపల్లి జోన్ పరిధి యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో చెత్త తొలగింపు, స్వీపింగ్, వ్యర్థాల నిర్వహణపై శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవ్‌ రావులతో సమీక్షించారు.

జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకారం అందించాలి

స్థానికులతో కమిషనర్ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటూ కమిషనర్ అడిగి తెల్సుకున్నారు. నరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. త్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావంతంగా సాగేలా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జోనల్, సర్కిల్ అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. సకాలంలో చెత్త సేకరణకు వెంటనే చేపడుతూ పరిశుభ్రత నెలకొనేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆర్ వి కర్ణన్ సూచించారు.

 Also Read: GHMC: జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన.. ఖైరతాబాద్ రాజ్‌భవన్ రోడ్డుపై.. ప్లాస్టిక్ టైల్స్ ప్రయోగం

వాహనాల దొంగలు అరెస్ట్ 5 టూ వీలర్లు స్వాధీనం

వాహనాలను తస్కరిస్తున్న ఇద్దరిని టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.50లక్షల విలువ చేసే అయిదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్​ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకి సమతా కాలనీ నివాసి మీర్​ మిరాజ్​ హుస్సేన్​ కు చెందిన యమహా బైక్ అతని ఇంటి ముందు నుంచి ఇటీవల చోరీకి గురైంది. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు టోలీచౌకీ సీఐ రమేశ్​ నాయక్​, అదనపు సీఐ బాల్​ రాజ్, ఎస్​ఐ రాఘవేంద్రతోపాటు క్రైం టీం పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు.

టోలీచౌకీ చౌరస్తా వద్ద తస్కరించిన యమహా బైక్ పై వెళుతున్న హకీంపేట కుంట వాస్తవ్యులు సంకురు విజయ భాస్కర్ రెడ్డి (23), ప్రవీణ్​ కుమార్​ (17)లను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ఇద్దరు కలిసి మరో నాలుగు టూ వీలర్లను కూడా అపహరించినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, టోలీచౌకీ క్రైం టీం పోలీసులు పది మంది పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేశారు.

 Also Read: Indian Handicrafts: ఈ నెలలో భారతీయ చేతివృత్తుల మహోత్సవం.. ఎక్కడో తెలుసా..?

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ