Indian Handicrafts: ఈ నెలలో భారతీయ చేతివృత్తుల మహోత్సవం
Indian Handicrafts (imagecredit:twitter)
Telangana News

Indian Handicrafts: ఈ నెలలో భారతీయ చేతివృత్తుల మహోత్సవం.. ఎక్కడో తెలుసా..?

Indian Handicrafts: భారతీయ చేతివృత్తుల వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(National Institute of Fashion Technology) (నిఫ్ట్​)ఆధ్వర్యంలో ‘ఛాప్​ 2025′ (Crafting the Future​) అనే జాతీయ స్థాయి కార్యక్రమం శిల్పారామంలో ప్రారంభించబోతున్నారు. అందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12 నుంచి 17 వరకు బ్లెండింగ్ హెరిటేజ్ విత్ కాంటెంపరరీ డిజైన్(Blending Heritage with Contemporary Design) అనే థీమ్‌తో చేతివృత్తులు, హస్త కళలు, సాంప్రదాయ కళల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ప్రాచీన కళలు ప్రత్యక్షంగా..

దేశంలోని 18 నిఫ్ట్​ క్యాంపస్‌ల నుంచి 60 మంది చేతివృత్తి కళాకారులు, 42 మంది నిఫ్ట్​ పూర్వ విద్యార్థులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. బెంగళూరు(Beguluru), హైదరాబాద్(Hyderabad), పాట్నా(patna), చెన్నై(Chenai), శ్రీనగర్(Srinagar) వంటి ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు టెర్రకోట, తోలు బొమ్మలు, కేతా ఎంబ్రాయిడరీ, పులికాట్ ఆకు కళ, పేపర్ మాచే వంటి ప్రాచీన కళలను ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. మంగళవారం చాఫ్-2025 కార్యక్రమ పోస్టర్ ను నిప్ట్ కళాశాలలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతివృత్తులు, సాంప్రదాయ కళలను ప్రోత్సహించడంతోపాటు కళాకారుల సృనాత్మకతను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిఫ్ట్​ ఆధ్వర్యంలో జరిగే ‘ఛాప్’ కార్యక్రమానికి పర్యాటక శాఖ ఆతిథ్యం ఇస్తుందన్నారు.

Also Read; RBI Grade B Recruitment 2025: RBI‌ లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..

కేతా ఎంబ్రాయిడరీ పులికాట్ ఆకు కళా..

ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు క్రాఫ్టింగ్​ ది ఫ్యూచర్​ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం ఆంఫీ థియేటర్‌లో ‘సంపద’ అనే ఫ్యాషన్ షో(Fashion show) ఉంటుందన్నారు. 13న ప్రఖ్యాత డాలీజైన్ చేతుల మీదుగా ‘ది సారీ లెగసీ’ మాస్టర్‌క్లాస్, 14న ‘ఆథెంటిసిటీ మ్యాటర్స్ (Markers of Identity in Textiles)పై చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 15న కేతా ఎంబ్రాయిడరీ, పులికాట్ ఆకు కళా ప్రదర్శనలు, 16న విజన్ స్టార్ వర్క్‌షాప్, చేతివృత్తుల భవిష్యత్​ను నిర్దేశించే ‘జియో గ్రాఫికల్ ఇండికేషన్స్’ (GI)పై సెమినార్, 17న లాక్ బ్యాంగిల్స్, పేపర్ మాచే కళా ప్రదర్శనలతోపాటు కళాకారులకు సన్మానం, అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భారతీయ చేతివృత్తుల వైభవాన్ని ప్రదర్శించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళాకారులు సృజనాత్మకతను ప్రదర్శించడంతోపాటు కొనుగోలుదారులకు ప్రత్యేకమైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇది మంచి వేదిక అని పేర్కొన్నారు.

Also Read: Hanumakonda District: ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం: కలెక్టర్ స్నేహ శబరీష్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క