Nepal GenZ Protests: నేపాల్‌లో సోమవారం మెుదలైన జెడ్ జనరేషన్ నిరసనలు.. మంగళవారం హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేదంతో మెుదలైన అల్లర్లు.. దానిని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చల్లారలేదు. మరింత ఉదృతంగా మారి.. నేపాల్ ను రాజకీయ సంక్షోభంలోకి నెట్టివేసే పరిస్థితులకు దారితీశాయి. ప్రధాని కేపీ ఓలీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజధాని ఖాడ్మాండ్ లోని రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసాలపై హింసాత్మక దాడులకు తెగబడ్డారు.
దాడి దృశ్యాలు వైరల్..
జెడ్ జనరేషన్ నిరసనలు.. రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ నివాసానికి మంగళవారం నిప్పు పెట్టారు. అదే సమయంలో ప్రధాని కె.పి. ఓలి ఇంటిని దోచేసి.. ధ్వంసం చేశారు. మాజీ ప్రధానమంత్రులు పుష్ప కమల్ దహాల్ (ప్రచండ), శేర్ బహదూర్ దేవూబా ఇళ్లను సైతం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో విద్యుత్ శాఖ మంత్రి దీపక్ ఖడ్కా నివాసం కూడా దెబ్బతింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నేపాల్ అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి నిరసనకారులు విధ్వంసం చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Civilian Casualties Rise in Kathmandu as the Maoist Nepali Police continues to openfire on the GenZ protestors.
Many Govt. Officials were seen ramming the protestors with their VIP vehicles while fleeing.
1/2 https://t.co/68W2iGk22T pic.twitter.com/Ruw3VuZBZ3— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) September 9, 2025
మంత్రులు.. వరుస రాజీనామాలు
జెడ్ జనరేషన్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. నేపాల్ మంత్రులు ఒక్కొక్కరిగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని కేపీ ఓలి సైతం పదవి నుంచి వైదొలగాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ప్రధానిపై ఒత్తిడి క్రమ క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. భారీ అల్లర్ల నేపథ్యంలో రాజధాని ఖాట్మాండ్ సహా.. నేపాల్ లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
రంగంలోకి సైన్యం
వేలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు నేపాల్ ప్రభుత్వం సైన్యాన్ని సైతం రంగంలోకి దింపింది. దీంతో నిరసనకారులను సైన్యం, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల భద్రతా సిబ్బంది పైకి రాళ్లు రువ్విన ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అయితే పోలీసులు బలప్రయోగం చేయకుండా సంయమనం పాటిస్తున్నారు.
19 మంది మృత్యువాత
సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. ‘మన స్నేహితులు చనిపోతున్నారు కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఓలిని గద్దె దించాలి’ అని నిరసనకారి నారాయణ ఆచార్య అన్నారు. ‘ఈ హిట్లర్‌లాంటి ఓలి ప్రభుత్వం విద్యార్థులపై నేరుగా కాల్పులు జరుపుతోంది. ఇది ఎంతవరకూ కొనసాగుతుందో మేము చూస్తాం’ అని మరో నిరసనకారి దుర్గనాథ్ దహాల్ పేర్కొన్నారు.
Also Read: Pig Kidney Transplant: వైద్య రంగంలో సంచలనం.. 54 ఏళ్ల వ్యక్తికి.. పంది కిడ్నీ అమర్చిన వైద్యులు
ఎందుకు నిరసనలు?
ఏకంగా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బ్లాక్ చేస్తూ సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యువత భగ్గుమన్నారు. జెన్ జెడ్ ఉద్యమానికి ఈ పరిణామమే తక్షణ కారణంగా ఉంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్‌తో పాటు ప్రముఖ యాప్స్, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. నేపాల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ రిజిస్టర్ కాలేదని, అందుకే నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వంపై విమర్శలను అణచివేసేందుకు తీసుకున్న చర్యగా నిరసనకారులు అభివర్ణిస్తున్నారు. నిషేధించాల్సింది సోషల్ మీడియాను కాదని.. ప్రభుత్వం చేస్తున్న అవినీతినని మండిపడుతున్నారు.