Group 1 Exams: తెలంగాణ గ్రూప్ 1 పరీక్షపై హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన పరీక్షా ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను తొలగించి.. తిరిగి మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కానీ పక్షంలో.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ బోర్డుకు స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే ర్యాంకులు సాధించి వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బిగ్ షాక్ తగిలినట్టైంది.
వివాదం ఏంటంటే..
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ – 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైతం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నందున ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ముగిసేలా చూడాలని కోరారు. దీంతో రెండు పీటిషన్లను కలిపి హైకోర్టు విచారణకు స్వీకరించింది.
Also Read: Hero Dog: ఓరి దేవుడా.. ఈ శునకం మాముల్ది కాదు భయ్యో.. బాంబ్ బ్లాస్ట్‌నే అడ్డుకుంది!
హైకోర్టు కీలక తీర్పు
తాజాగా దీనిపై విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బెంచ్.. ఇరు పక్షాల వాదనలు ఆలకించింది. అనంతరం రీవాల్యుయేషన్ కు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈసారి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా రీవాల్యూయేషన్ జరిపించాని టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. పునః మూల్యంకనం జరిపిన తర్వాతే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని స్పష్టం చేసింది. 8 నెలలులోగా రీ వాల్యుయేషన్ ప్రక్రియ ముగించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఏమైనా అడ్డంకులు ఉన్నట్లు భావిస్తే.. మళ్లీ పరీక్ష నిర్వహించుకోవచ్చని టీజీపీఎస్సీకి దిశానిర్దేశం చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Also Read: Allu Arjun: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి షాకింగ్ నోటీసు!
గ్రూప్ 1 పరీక్షల గురించి..
గ్రూప్ 1 కు సంబంధించి 563 పోస్టుల భర్తీకి గాను.. గతేడాది టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షను 2024 జూన్ 9న నిర్వహించగా.. 31,403 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ ను గతేడాది అక్టోబర్ 21-27 తేదీల మధ్య నిర్వహించగా.. 21,093 మంది హాజరయ్యారు. తుది ఫలితాలను మార్చి 10, 2025లో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఆపై ఏప్రిల్ లో ఎంపికైన అభ్యర్థుల వెరిఫికేషన్ సైతం జరిగింది. పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో హైకోర్టు ఫలితాలను రద్దు చేయడం ఉత్తీర్ణులకు బిగ్ షాకే అని చెప్పాలి.