CP Anandh (imagecredit:swetcha)
హైదరాబాద్

CP Anandh: నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది: సీపీ ఆనంద్

CP Anandh: నిమజ్జన ప్రక్రియ వేగంగా జరగటానికి పుషింగ్ పార్టీలను పెట్టినట్టు హైదరాబాద్ సీపీ ఆనంద్(CP Anandh) చెప్పారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం 1.05 గంటలకు పూర్తి అయ్యిందన్నారు. బాలాపూర్ వినాయక నిమజ్జనం సాయంత్రం 6.11 గంటలకు జరిగినట్టు చెప్పారు. ఇప్పటివరకు 650 విగ్రహాల నిమజ్జనం అయ్యిందని చెప్పారు.ఇంకా 4,500 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందన్నారు. ఛత్రినాకా, చాంద్రాయణ గుట్ట, సైబరాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ఇంకా రోడ్లపై ఉన్నట్టు ఏరియల్ సర్వే ద్వారా గుర్తించామని తెలిపారు.

 టీఎస్ కాప్ యాప్ లో

నాలుగు వరుసల్లో విగ్రహాల శోభాయాత్రను కొనసాగించి నిమజ్జనం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసారి గణేశ్ నిమజ్జనానికి సాంకేతికతను వినియోగించుకున్నామన్నారు. గణేశ్ విగ్రహాలను జియో-ట్యాగింగ్ చెయ్యటంతో ప్రక్రియ సులభమైందని తెలిపారు. టీఎస్ కాప్ యాప్ లో యాప్లో గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక ఆప్షన్‌ను ప్రవేశపెట్టామన్నారు. దీనివల్ల ఇన్‌స్పెక్టర్ స్థాయిలో కూడా తమ పరిధిలోని విగ్రహాల కదలికలను ట్రాక్ చేయగలుగుతున్నట్టు చెప్పారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తీసుకున్న చర్యల వల్ల 10 శాతం సీసీ కెమెరాల కనెక్షన్లు తెగిపోయాయని తెలిపారు.

Also Read: BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

నిమజ్జన ప్రక్రియను పూర్తి

నిమజ్జనం కోసం వీటిలో 3శాతం వాటికి మరమ్మత్తు చేసినట్టు చెప్పారు. నిఘా కోసం 9 డ్రోన్లు, 35 హై-రైజ్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రేన్‌లు నిమజ్జనం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు. నేటి పరిస్థితిని బట్టి ట్రాఫిక్ నిబంధనల సడలింపు ఉంటుందని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా అన్ని శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి అవసరమైన సూచనలు ఇస్తున్నట్టు తెలిపారు.

Also Read: CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Just In

01

Kavithakka Update: కవితక్క అప్ డేట్ పేరుతో ఎక్స్లో కథనాలు.. టార్గెట్ గులాబీ నేతలు?

Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది

OTT Movies: ఓటీటీ లవర్స్ కి పండగే.. ఆ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి.. చూసేందుకు మీరు సిద్ధమేనా?

Zelensky: భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి స్పందన

Mahabubabad District: యువకుడి పై ఆత్మహత్యా యత్నం.. పట్టించుకోని అధికారులు