BRS Party: పార్టీకి జరిగిన నష్టాన్ని పూరించే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం నిమగ్నమైంది. నేతలతో నిత్యం మాట్లాడిస్తే కవిత అంశం చర్చకు రాదని భావించిన పార్టీ.. ఒకవైపు కవిత విమర్శలపై.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై మీడియా వేదికగా ఎత్తిచూపాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ప్రతి రోజూ సెలక్టు చేసిన నేతలతో మాట్లాడిస్తున్నట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో భారీగా నష్టం
గులాబీ నేతలపై ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలు పార్టీని డ్యామేజ్ చేసినట్లు అధిష్టానం గుర్తించినట్లు సమాచారం. ఆ నష్టాన్ని పూరించకపోతే రాబోయే రోజుల్లో భారీగా నష్టం జరుగుతుందని భావించి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు పెట్టిస్తున్నట్లు సమాచారం. మహిళా నేతలతో సైతం సమావేశం ఏర్పాటుచేయించి కవిత(kavitha)పై విమర్శలు చేయించారని కవిత అనుచరులుమండిపడుతున్నారు. గతంలో ఎప్పుడు చేయని నేతలతోనూ కవితపై మాట్లాడించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కవిత అంశం పార్టీ కేడర్ లో గానీ, ప్రజల్లోకి గానీ చర్చరాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒక వైపు కవిత తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పార్టీ కేడర్ సైతం కవిత వైపు చూడకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం హామీలు ఇస్తున్నట్లు సమాచారం. పార్టీని నేతలు వీడకుండా ఇప్పటికే ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read; Panchayat Elections: స్థానిక ఎన్నికలకు గద్వాల జిల్లా సర్వం సిద్ధం
కవితను హైలెట్ చేయడం ఎందుకు..
కవిత ఎపిసోడ్ పై కేవలం సెకండ్ స్థాయి నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav), జగదీష్ రెడ్డి(jagadesh Reddy), ఎర్రబెల్లి దయాకర్(Erra bellied dayakar), హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) ఎవరు మాట్లాడలేదు.. ఎందుకు మాట్లాడటం లేదనేది ఇప్పుడు ప్రధానంగా చర్చజరుగుతుంది. కవితను మళ్లీ హైలెట్ చేయడం ఎందుకు అని సైలెంట్ గా ఉన్నారనేది వారి తీరే స్పష్టమవుతుంది. లేకుంటే కవిత నేతలనే కాదని వ్యవహరిస్తున్నారా? అనేది ఇప్పుడు చర్చమొదలైంది. కవిత పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కుమార్తె కావడంతోనే గుర్తింపు ఉండేదని, ఎమ్మెల్సీ అయినప్పటికీ అంత ప్రాధాన్యత లేదని, కేసీఆర్ తోనే ఆమెకు భరోసా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆమె చేసే విమర్శలకు పార్టీలోని కీలక నేతలు ఎవరు స్పందించడం లేదని ప్రచారం జరుగుతుంది. లేకుంటే విమర్శలు చేసి మళ్లీ మాటలు అనిపించుకోవడ ఎందుకని సైలెంట్ గా ఉంటున్నారా? అనేది సైతం రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతుంది.
చర్చకు రావాలంటూ సవాల్
మరోవైపు గతంలో తెలంగాణ జాగృతిలో పనిచేసిన వారంతా రెండు వర్గాలు చీలిపోయారు. ఒకరు కవిత వర్గం, ఒకరు కేసీఆర్ వర్గం అంటూ జాగృతి నాయకులు విడిపోయారు. దీంతో కేసీఆర్(KCR) తో పనిచేస్తామంటున్న నేతలు కవిత వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. తమకు అన్యాయం చేశారని మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కవిత జాగృతి వర్గం నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు. నాడు కవిత ఆశీర్వాదంతో కార్పొరేషన్ తో పాటు పార్టీ పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా? అని ప్రతి విమర్శలు చేస్తున్నారు. చర్చకు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. దీంతో గతంలో పనిచేసివారు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి విమర్శలకు పదునుపెట్టడంతో ప్రజలు సైతం ఆసక్తిగా పరిణామాలను పరిశీలిస్తున్నారు. తాజా పరిణామాలు గులాబీ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో ఏమేరకు డ్యామేజ్ చేస్తాయనే ప్రచారం జరుగుతుంది. దానిని కంట్రోల్ కు పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. వాహనదారులకు ట్రాఫిక్ సీపీ కీలక సూచనలు