KTR (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

KTR: సిరిసిల్ల జేఎన్టీయూ లో సమస్యల పై కేటీఆర్ సీరియస్

KTR: సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనేచర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ పాలనలో ప్రారంభించిన జేఎన్టీయూ సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీకి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడలోని డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న ప్రస్తుత తాత్కాలిక తరగతి గదులకు తాళం వేయడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను సీరియస్‌గా తీసుకున్నారు.

భవనాలకు అనుమతులు

సమస్యను పరిష్కరించేందుకు జేఎన్టీయూ(JNTU) వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి(Kishna Kumar Reddy), సాంకేతిక విద్యా కమిషనర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని, త్వరగా శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని సూచించారు. అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read:  Little Hearts Movie Review: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ.. కుర్ర హీరో హిట్ కొట్టాడా?

టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్

కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకొని పెండింగ్లో ఉన్న అద్దె బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు. ఈ అంశంలో సానుకూలంగా స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్(Commissioner of Technical Education) వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతోపాటు తరగతులకు ఎలాంటి అంతరాయం లేకుంటే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2023లోనే మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలం కేటాయించినందున, అక్కడ త్వరగా శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Just In

01

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన

R.V. Karnan: శానిటేషన్ వర్కర్ల జీవితాల్లో వెలుగు.. రూ. 30 లక్షలకు పెరగనున్న కార్మికుల ఇన్సూరెన్స్