CBI Director Praveen Sood: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఆయన రావటం ఇటు పోలీస్.. అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఘనంగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Byrage) పిల్లర్లు కట్టిన మూడేళ్లకే కూలిపోయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాగానే దీనిపై మొదట విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్(Justice P.C. Ghosh Commission) ను ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపింది. అటు విజిలెన్స్.. ఇటు పీ.సీ.ఘోష్ కమిషన్ జరిపిన విచారణల్లో ప్లానింగ్, డిజైనింగ్ లోపాలతోపాటు నాణ్యతను పాటించక పోవటం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి పోయాయని నిర్ధారణ అయ్యింది.
Also Read; Viral video: అయ్యబాబోయ్.. దిల్లీ నడిబొడ్డున జలపాతం.. అది కూడా మెట్రో స్టేషన్‌లో..
కోఠిలోని సీబీఐ కార్యాలయంలో
దాంతోపాటు ప్రాజెక్టులో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా బయట పడింది. ఈ నేపథ్యంలో పీ.సీ.ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ జరిపిన ప్రభుత్వం ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు (జీవో నెంబర్ 104) కూడా జారీ చేసింది. ఇక, జీవో ప్రతి తమకు అందినట్టుగా సీబీఐ వర్గాలు కూడా నిర్ధారించాయి.
ఇది జరిగిన కొన్ని రోజులకే సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(CBI Director Praveen Sood) హైదరాబాద్(Hyderabad) రావటం.. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో సమావేశం కావటం చర్చనీయంగా మారింది. సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) అక్రమాల కేసుతోపాటు న్యాయవాద దంపతులు వామనరావు హత్యకు సంబంధించిన కేసుపై చర్చ జరిగినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: Niharika Konidela: సారీ అమ్మా! అంటూ నిహారిక పోస్ట్.. అల్లు శిరీష్ కామెంట్ వైరల్!