Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un: ) భద్రత విషయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది చాలా పకడ్బందీగా ఉంటారు. ముఖ్యంగా ఆయన విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అందుకు, ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది కిమ్ తాజా చైనా పర్యటన. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్, బీజింగ్ నగరంలో బుధవారం భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం అలా ముగిసిందో లేదో, కిమ్ సహాయక సిబ్బంది సెకన్ల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని ఆయన కూర్చున్న కుర్చీని శుభ్రం చేశారు. అది కూడా చాలా తొందరగా ఆ పనిని కానిచ్చేశారు. కూర్చున్న సీటును మాత్రమే కాదు, ఆయన చేతులతో తాకిని అన్ని ప్రదేశాలను సైతం అదే రీతిలో తుడిచారు. కిమ్ చేతులు వేసిన టేబుల్‌ను కూడా శుద్ధి చేశారు. ఇక, ఆయన మంచినీళ్లు తాగిన గ్లాసునైతే ఏకంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్లాసును ప్రత్యేక ట్రేలో తీసుకొని వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
Read Also- Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం ప్రాజెక్ట్.. 2 గేట్లకు లీకేజీలు.. భద్రతపై తీవ్ర ఆందోళనలు
ఇదంతా ఎందుకంటే?
కిమ్ జాంగ్ ఉన్ డీఎన్ఏ ఆనవాళ్లను చెరిపివేయడమే లక్ష్యంగా ఉత్తరకొరియా భద్రతా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అందుకే, కిమ్ తాకిన ప్రదేశాన్ని శుభ్రం చేశారని రష్యాకు చెందిన జర్నలిస్ట్ అలెగ్జాండర్ యునషెవ్ చెప్పారు. ఈ మేరకు తన టెలిగ్రామ్ ఛానల్ ‘యునషెవ్ లైవ్’లో వివరించారు. కిమ్ నీళ్లు తాగిన గ్లాసును తీసుకెళ్లారని, కూర్చున్న కుర్చీని, ఇతర ఫర్నిచర్ భాగాలను రజమా తుడిచారని చెప్పారు. కిమ్ భద్రతా సిబ్బంది క్లీనింగ్ విషయాలను పక్కనపెడితే, పుతిన్-కిమ్ భేటీ సజావుగా జరిగిందని, సమావేశానికి ముందు ఇద్దరూ టీ తాగారని యునషెవ్ చెప్పారు.
కిమ్ ఈ స్థాయిలో భద్రతా జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం స్పష్టంగా తెలియదు. అయితే, రష్యా గూఢచారుల భయమో, లేక చైనా నిఘా సంస్థల భయం కారణం కావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్క కిమ్ మాత్రమే ఈ విధంగా చేయడం లేదని, ప్రపంచంలో చాలామంది నాయకులు ఈ విధంగా నడుచుకుంటున్నారని, వారి జీవనశైలి ఆనవాళ్లు ఇతరదేశాల వారికి దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తున్నారు.
పుతిన్ కూడా అంతే!
రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన డీఎన్ఏ ఎవరి చేతుల్లోకీ వెళ్లకుండా అసాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతున్నారు. 2017 నుంచి, ఆయన విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ, ఆయన వెంబడి ఉంటే బాడీగార్డులు ఆయన మల, మూత్రాలను సీల్డ్ బ్యాగుల్లో సేకరిస్తున్నారు. వాటిని రహస్యంగా తిరిగి రష్యాకు తీసుకెళ్లే విధానాన్ని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ భేటీ అయినప్పుడు కూడా ఈ విధానాన్ని పాటించారు. రష్యా భద్రతా సిబ్బంది పుతిన్ మలవ్యర్థాలను ప్రత్యేక సూట్‌కేసుల్లో మాస్కోకు తీసుకెళ్లారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
The staff accompanying the North Korean leader meticulously erased all traces of Kim's presence.
They took the glass he drank from, wiped down the chair's upholstery, and cleaned the parts of the furniture the Korean leader had touched. pic.twitter.com/JOXVxg04Ym
— Russian Market (@runews) September 3, 2025