Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్ట్ భద్రతపై మరోమారు చర్చ మెుదలైంది. ప్రాజెక్టుకు ఉన్న 12 గేట్లలో రెండు గేట్ల నుంచి నీరు లీకవుతోంది. 3, 10 గేట్ల నుంచి నీరు వృథాగా కిందికిపోతోంది. అయితే ఇటీవల వరదల రావడానికి ముందే గేట్లకు ఉన్న పాత రబ్బర్ సీళ్లను తొలగించి కొత్తవి అమర్చారు. 2 నెలలు కూడా తిరగక ముందే కొత్త రబ్బర్ సీళ్లు పాడై నీరు వృథాగా కిందికి పోతోంది.
స్థానికుల్లో ఆందోళనలు
దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యామ్ గేట్ల భద్రపై అందరిలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి.. నీరు లీక్ కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోమారు ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఇటీవల శ్రీశైలానికి భారీగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు గేట్లను ఎత్తి నీటిని కిందికి సైతం విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్ లో గరిష్ట స్థాయిలో నీరు ఉండటంతో నీటి లీకేజీపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు..
2 గేట్లకు లీకేజీలు
3, 10వ నెంబర్ గేట్ల నుంచి లీకవుతున్న నీరు
వరదలకు ముందే కొత్త రబ్బర్ సీళ్లు అమర్చిన అధికారులు
రెండు నెలలు తిరగకముందే పాడైపోయిన కొత్త రబ్బర్ సీళ్లు
శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పని తీరుపై తీవ్ర విమర్శలు
డ్యామ్ గేట్ల భద్రతపై… pic.twitter.com/WrKyahecel
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2025
శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రత్యేకతలు
శ్రీశైలం ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది దేశంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ (జల విద్యుత్) ప్రాజెక్టులలో ఒకటి. 1960లో ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1981లో డ్యామ్ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్ట్ ఎత్తు 145 మీటర్లు (476 అడుగులు), పొడవు 512 మీటర్లు (1,680 అడుగులు) కాగా.. 12 రేడియల్ క్రెస్ట్ గేట్లను దీనికి అమర్చారు. 616 చ.కి.మీ విస్తీర్ణం కలిగిన ఈ డ్యామ్.. 215 టీఎంసీల నీటిని స్టోర్ చేయగలదు. 1998, 2009లో వరదల వల్ల ప్రాజెక్ట్ కు డ్యామేజ్ జరగ్గా.. రిపేర్లు చేశారు.
Also Read: Viral Video: రోడ్డుపై భారీగా ట్రాఫిక్.. చిర్రెత్తుకొచ్చి బైకర్ ఏం చేశాడో చూడండి!
ప్రయోజనాలు..
ఇది భారతదేశంలో 2వ అతి పెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. 1,670 మెగా వాట్ల జల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు. శ్రీశైలం ప్రాజెక్ట్ పర్యాటకంగానూ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు.. తప్పనిసరిగా ఈ డ్యామ్ ను సందర్శిస్తారు. ముఖ్యంగా గేట్లు ఎత్తే సమయాల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి సైతం పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడి వస్తారు.