Expand Dog Squad: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డాగ్ స్క్వాడ్ ను విస్తరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 34 పోలీసు జాగిలాలకు అదనంగా మరో 20 శునకాలను స్క్వాడ్ లో చేర్చనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(Integrated Intelligence Training Academy)లో వీటికి శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తరువాత డాగ్ స్క్వాడ్(Dog Squad) లోకి చేర్చుకోనున్నారు. దోపిడీ.. దొంగతనం.. హత్యలు.. బాంబు బెదిరింపులు.. ఇలా ఏ నేరం జరిగినా వాటి పరిష్కారంలో పోలీసు జాగిలాలు కీలకపాత్ర వహించే విషయం అందరికీ తెలిసిందే. క్లూస్ టీంతోపాటు నేర స్థలానికి వచ్చే ఈ జాగిలాలు వాసన ద్వారా అనుమానితులను పసిగడుతుంటాయి.
కొత్తగా మరో 20 జాగిలాలు
ప్రస్తుతం హైదరాబాద్(Hyderabada) సిటీ పోలీస్ లో 34 జాగిలాలతో డాగ్ స్క్వాడ్ పని చేస్తోంది. అయితే, నేరాల సంఖ్య పెరిగిపోతుండటంతో వీటిపై పని భారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్(CV Ananadh) డాగ్ స్క్వాడ్ ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగా మరో 20 జాగిలాలను స్క్వాడ్ లో చేర్చనున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుంచి నాణ్యమైన శునకాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 12 జాగిలాలను ఎంపిక చేశారు కూడా. వీటికి ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.
Also Read: Tragic Incident: గద్వా ల జిల్లా దారుణం.. ఉపాధి కోసం వెళ్లి విగత జీవులుగా మారిన దంపతులు?
11.5 ఎకరాల్లో డాగ్ కెన్నెల్..
డాగ్ స్క్వాడ్ లోని జాగిలాల కోసం 11.5 ఎకరాల విస్తీర్ణంలో డాగ్ కెన్నెల్(Dog kennel) ఏర్పాటు చేయనున్నారు. గోషామహల్ పోలీస్ స్టేడియం స్థలాన్ని కొంతకాలం క్రితం ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్థలంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్టేడియంలోని గుర్రపు శాల, మైదానంతోపాటు సిటీ సెక్యూరిటీ వింగ్ భవనాలను ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులను కూడా మంజూరు చేసింది. ఈ స్థలంలోనే డాగ్ కెన్నెల్ తోపాటు మౌంటెడ్ దళంలో ఉన్న గుర్రాల కోసం కొత్తగా అశ్వశాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఆనంద్ చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈనెల 8న పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
Also Read: Vijaya Rama Rao: కన్నతండ్రి కేసీఆర్‌పై కవిత ఒత్తిడి.. అందుకే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్?