Vijaya Rama Rao(iMAGE CREDIT: TWITTER)
Politics

Vijaya Rama Rao: కన్నతండ్రి కేసీఆర్‌పై కవిత ఒత్తిడి.. అందుకే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్?

Vijaya Rama Rao:దేండ్లు దోచుకున్న సొమ్ములో వాటాల పంచాయితీ వల్లే బీఆర్ఎస్(BRS) లో ఈ గందరగోళం ఏర్పడిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు(Vijaya Rama Rao) ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరెవరికి ఎంతెంత వాటా వచ్చిందో? అందులో కవితకు ఎంతొచ్చిందోనని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. సంతృప్తి లేని వాటా వచ్చినందుకే కవిత ఆరోపణలు చేయడం మొదలుపెట్టిందని వ్యాఖ్యానించారు. వాటాల పంపిణీలో కన్నతండ్రి పైనే ఒత్తిడి తీసుకొచ్చినందుకే కేసీఆర్(KCR) కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.

 Also Read: Amit Shah: 6న హైదరాబాద్‌కు అమిత్ షా.. నేతల అంతర్గత పోరుపై చర్చించేనా?

కవితకు విజయరామరావు గుర్తొచ్చారా?

కవిత లేవనెత్తిన ఆరోపణలన్నింటికీ మాజీ సీఎం కేసీఆరే(kcr) బాధ్యుడన్నారు. ఇన్నాళ్లకు కవితకు విజయరామరావు(Vijaya Rama Rao) గుర్తొచ్చారా? అంటూ ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్(kcr) అవినీతి పాలన, నియంతృత్వ పాలనకు కారణం హరీశ్ రావే బాధ్యుడని కవిత చెబుతోందని, కాళేశ్వరం నిర్మాణం, కుంగుబాటు, నిధుల దుర్వినియోగంలో హరీశ్ ఒక్కడే ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ కు తెలియకుండానే ఇవన్నీ జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. హరీశ్ రావు మంత్రి పదవి దిగిన తర్వాత పర్యవేక్షణ అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉందని, మరెందుకు సరిచేయలేదని విజయరామారావు పేర్కొన్నారు.

నాడు కవిత కళ్లు, నోరు మూసుకుని ఉందా?

వారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే ప్రశ్నకు కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కుటుంబం స్థాయి ఏంటని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ స్థాయి ఏంటని నిలదీశారు. ఉద్యమం పేరుతో అంతులేని అపార తెలంగాణ ప్రజాసంపదను దోచుకోలేదని గుండెలపై చేయి వేసుకుని కవిత చెప్పాలని సవాల్ విసిరారు. నాడు కవిత కళ్లు, నోరు మూసుకుని ఉందా అని, ఇవ్వాళే కళ్లు తెరిచిందా అని ఫైరయ్యారు.

గతంలో తమపై కూడా అనేక కుట్రలు జరిగాయని, జరిపారని, అది కేసీఆర్ కు తెలియదా? అని విజయరామారావు ప్రశ్నించారు. ఘన్ పూర్ స్టేషన్, వర్ధన్నపేటలో తనను గెలవకుండా ప్రత్యర్థులకు డబ్బు సంచులు పంపించి ఓడించిన విషయం కేసీఆర్ కు తెలియదా? అంటూ నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబం తీరువల్ల ఈటల రాజేందర్, విజయశాంతి మాత్రమే కాక అనేక మంది అవమానాలను ఎదుర్కొన్నారని విజయరామారావు తెలిపారు.

 Also Read: Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం