Tragic Incident( iamge CREDIT SWETCHA REPORTER)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Tragic Incident: గద్వా ల జిల్లా దారుణం.. ఉపాధి కోసం వెళ్లి విగత జీవులుగా మారిన దంపతులు?

Tragic Incident: తాటికుంట రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు అరివిలి బోల్తాపడడంతో ఇద్దరు భార్యాభర్తలు రిజర్వాయర్ లో  సాయంత్రం గల్లంతయ్యారు. నేటి ఉదయం చేపల వేటకు వెళ్లిన వారికి మృతదేహాలు నీటిలో తేలడంతో వారు గుర్తించారు.

జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోని బావి రాముడు (40), భార్య సంధ్య (35) ఇద్దరూ తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో పిల్లలు,బంధువులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెతికినా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

 Also Read: OTT Crime Thriller: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్ల‌ర్‌ మూవీ.. వరుస హత్యలు చేసిందెవరు?

సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే

రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,(SP Srinivasa Rao) ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) తాటికుంట రిజర్వాయర్ కు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. గల్లంతయిన వారి పిల్లలను ఎమ్మెల్యే ఎస్పీ ఓదార్చి బాసటగా నిలుస్తామని హామీనిచ్చారు. రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ దొరకలేదు.

ఎట్టకేలకు మృతదేహాలు లభ్యం

తాటికుంట రిజర్వాయర్ లో ప్రతిరోజు మాదిరిగానే గ్రామస్తులు కొందరు చేపల వేటలో భాగంగా నేటి ఉదయం రిజర్వాయర్ లో సంచరిస్తుండగా తేలిన మృతదేహాలు వారికి కనిపించాయి దీంతో అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 Also Read: UP Crime: రాఖీ కట్టిన మైనర్ బాలికపై హత్యాచారం.. వీడు అసలు మనిషేనా?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం