Ott Movie ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OTT Crime Thriller: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్ల‌ర్‌ మూవీ.. వరుస హత్యలు చేసిందెవరు?

Detective Ujjwalan: మూడు నెలల క్రితం మలయాళం థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మిస్టరీ-కామెడీ థ్రిల్లర్ చిత్రం డిటెక్టివ్ ఉజ్వలన్. ఇంద్రనీల్ గోపాలకృష్ణన్, రాహుల్ జి ద్వయం రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్, రోని డేవిడ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే నెలలో ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో ఇతర భాషల సినీ లవర్స్ నిరాశకు గురయ్యారు.

Also Read: Rashid Khan: చరిత్ర తిరగరాసిన అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ప్రపంచంలో ఏ ఆటగాడికీ సాధ్యంకాలేదు

అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అది కూడా లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇక కథలోకి వెళితే… కేరళలోని ఓ మారుమూల గ్రామం, 1960 తర్వాత ఎలాంటి హత్యలూ జరగకుండా ప్రశాంతంగా ఉంటూ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందుతుంది. అయితే, హఠాత్తుగా ఆ గ్రామంలో వరుస హత్యలు జరగడం మొదలవుతాయి. ఒక అగంతకుడు సుత్తితో మనుషులను చంపుతూ ఉంటాడు.

Also Read: Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇక యూరియా కష్టాలు తీరినట్లే.. మంత్రి కీలక ఆదేశాలు

ఇదే సమయంలో, లైబ్రేరియన్‌గా పనిచేసే ఉజ్వలన్ గ్రామంలో జరిగే చిన్నచిన్న దొంగతనాలు, మేకలు, బంగారు గొలుసులు వంటి కేసులను ఛేదించి పరిష్కరిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే, పోలీసుల సహాయంతో వరుస హత్యల కేసుపై దృష్టి సారించిన ఉజ్వలన్, క్లూలను సేకరిస్తూ హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, ప్రతిసారీ హంతకుడు చేతికి చిక్కే సమయంలో ఏదో ఒక విధంగా తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ముగ్గురు, నలుగురు అనుమానితులపై సందేహం పడినా, చివరకు ఏసీ, సీఐ కూడా హంతకులని అనుమానించే స్థాయికి వస్తుంది.

Also Read: MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఇలాంటి ఉత్కంఠభరిత నేపథ్యంలో, ఉజ్వలన్ నిజమైన హంతకుడిని పట్టుకోగలిగాడా? ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అనే ఆసక్తికర కథాంశంతో సినిమా సాగుతుంది. సినిమాలో ఎక్కడా అసభ్య సన్నివేశాలు లేకుండా, కుటుంబంతో కలిసి ఆనందించేలా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి లయన్స్ గేట్ ప్లేలో తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ, మిస్టరీ జానర్‌లను ఇష్టపడే వారికి డిటెక్టివ్ ఉజ్వలన్ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం