Yadagirigutta Temple: యాదగిరిగుట్ట నరసింహా స్వామి ఆలయానికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించాడు. ముత్తినేని వెంకటేశ్వర్లు అనే భక్తుడు రూ.4 కోట్ల విలువైన ఇంటిని స్వామివారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో గల ఈ ఇంటిని ఆలయానికి రాసిచ్చారు. గురువారం చిక్కడపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దేవుడి పేరు మీదకు ఆ భవంతిని ట్రాన్స్ ఫర్ కూడా చేయించారు. దీంతో 152 గజాలలో నిర్మితమైన జీ+3 (పెంట్ హౌస్ కూడా) స్వామివారి సొంతమైంది.
Also Read: Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!
రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను ఆయన, ఈవో వెంటకరావుకి, టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, దేవస్థాన అధికారుల సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరావు, దాత వెంకటేశ్వర్లును స్వామివారి కండువాతో సన్మానం చేశారు. స్వామివారి ప్రసాదం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి మీద భక్తితో కోట్ల విలువ గల ప్రాపర్టీని ట్రాన్స్ ఫర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడైనా టెంపుల్ వచ్చి ఆ స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చని చెప్పారు. స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, దాత ముత్తినేని వెంకటేశ్వర్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కొండా సురేఖ, ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్ ప్రత్యేకంగా అభినందించారు.