Hyderabad: హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 9 రోజుల పాటు మండపాల్లో గణనాథుడు ఎన్నో రకాల పూజలను అందుకుంటాడు. అనంతరం పదో రోజున నగర వీధుల్లో ఘనంగా ఊరేగించి చివరకూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. నగరం నలుమూలల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో ఏటా పలు మార్గాలను ట్రాఫిక్ పోలీసులు మూసివేస్తుంటారు. ఈ ఏడాది కూడా గణేష్ ఊరేగింపు నేపథ్యంలో కొన్ని మార్గాలు మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6న నగరంలో పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరగనున్న కారణంగా కొన్ని మార్గాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నగరంలో ప్రధాన నిమజ్జన కేంద్రాలు
హైదరాబాద్ లో సెప్టెంబర్ 6న పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్ వంటి ఫేమస్ గణనాథులను ఆరోజునే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలో మరికొన్ని నిమజ్జనం స్పాట్ లను ఇప్పటికే అధికారులు సిద్దం చేశారు. చార్మినార్, మీర్ పేట, దూల్ పేట్, సికింద్రాబాద్, హైటెసిటీ తదితర ప్రాంతాల్లోని చెరువుల వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
గత కొన్నేళ్లుగా..
వినాయక నిమజ్జనంలో భాగంగా హైదరాబాద్ లోని ఏ రోడ్లను మూసివేస్తున్నారన్న విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే గత కొన్నేళ్లుగా జరుగుతున్న రోడ్ల మూసివేత ప్రక్రియ, నిమజ్జనం కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో ఉంచుకొని.. మూతబడే అవకాశమున్న మార్గాలను అందించడం జరిగింది. ప్రాంతాల వారీగా వాటిపై ఓ లుక్కేద్దాం.
హుస్సేన్ సాగర్ (ప్రధాన కేంద్రం)
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ ప్రధానమైన కేంద్రంగా ఉంది. దాదాపు 50 వేల వరకూ విగ్రహాలను హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేస్తారని అంచనా. కాబట్టి NTR మార్గం (అబిడ్స్ నుండి పంజాగుట్టా వరకు) ఖైరతాబాద్ X రోడ్స్ నుండి ట్యాంక్ బండ్ వరకు, గోస్హాల రోడ్, లేంబార్డ్ వీధి, ప్రజా భవన్ చుట్టూ ఉన్న అన్ని రోడ్లు మూసివేసే అవకాశముంది. డైవర్షన్ విషయానికి వస్తే బంజారాహిల్స్ రోడ్ ద్వారా రీరూట్ చేయనున్నారు. ఆస్తానా రోడ్ లేదా రంజుమెహర్ రోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
చార్మినార్
* పటేల్ మార్కెట్ నుండి లాబ్కీర్ వరకు
* హైదరాబాద్-సికింద్రాబాద్ హైవే (రంగారెడ్డి క్రాస్‌రోడ్స్ భాగం)
* బండ్లగూడ రోడ్, ఫలక్ నామా మెయిన్ రోడ్
ధూల్ పేట్
* రీజెంట్స్ లైన్ నుండి అలీగూడా వరకు
* ధూల్ పేట్ క్రాస్ రోడ్స్
* మల్కజ్‌గిరి-అలీగూడా లింక్ రోడ్
సికింద్రాబాద్
* రెడ్ హిల్స్ నుండి పార్క్‌లేన్ వరకు
* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ అన్ని రోడ్లు
* జామా మసీద్ వీధి
ఇతర ప్రాంతాలు
* మాదాపూర్-హైటెక్ సిటీ రోడ్ (ఒక భాగం, రద్దీ ఆధారంగా)
* శ్రీనివాస్‌పురం, కొండాపూర్ మెయిన్ రోడ్
* గచ్చిబౌలి కొన్ని ప్రాంతాలు
ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్
ఖైరతాబాద్ గణనాథుడు వెళ్లే రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 6న అది వెళ్లే మార్గాల్లో వెహికల్స్ ను అనుమతించరు. కాబట్టి రూట్ మ్యాప్ లో చెప్పిన మార్గాల్లో వెళ్లకపోవడమే ఉత్తమం. ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి → పాత పీఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ →తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం → హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్).
Also Read: Viral video: అయ్యబాబోయ్.. దిల్లీ నడిబొడ్డున జలపాతం.. అది కూడా మెట్రో స్టేషన్‌లో..
బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్..
బాలాపూర్-కట్ట మైసమ్మ దేవాలయం → కేశవగిరి → చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ → మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ → ఇంజన్ బౌలి → అలియాబాద్ → నాగుల్ చింత జంక్షన్ → హిమ్మత్‌పురా → చార్మినార్ → మదీనా ఎక్స్ రోడ్ → అఫ్జల్ గుంజ్ →మోజాం జాహి మార్కెట్ → అబిడ్స్ జీపీఓ →బీజేఆర్ విగ్రహం→ బషీర్‌బాగ్ క్రాస్ రోడ్డు → లిబర్టీ → అంబేద్కర్ విగ్రహం →హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్).