Curd: పెరుగు తయారీ అంటే అంత సులువైన పద్ధతి కాదు. పాలను పొంగు వచ్చే వరకు కాచి, గోరువెచ్చగా చల్లారిన తర్వాత, రెండు ముచ్చికలున్న ఎండు మిరపకాయలను వేసి, గిన్నెకు మూత పెట్టి, రాత్రంతా వెచ్చని ప్రదేశంలో ఉంచితే, తెల్లవారేసరికి మీకు గడ్డలా బిగుసుకుని పెరుగు తయారవుతుంది.
పాత రోజుల్లో, వేసవి సెలవుల తర్వాత అనంతపూర్, చిత్తూరు, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు, పక్కింటి వాళ్ళ దగ్గర తోడుకి పెరుగు దొరికేది కాదు. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు ఈ ఎండు మిరపకాయల చిట్కాతోనే మొదటి పెరుగును తయారు చేసే వాళ్ళు.
ఇప్పుడు ఊళ్ళో పెరుగు తోడు ఇచ్చే ఇరుగుపొరుగు లేరు. పైగా వానా కాలంలో పెరుగు గడ్డలా బిగుసుకోవడం కూడా కాస్త కష్టమే. అందుకే తోడు విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ, పొరపాట్లు జరగొచ్చు కదా? అందుకే ఈ సింపుల్ చిట్కాను పాటించి పచ్చిమిర్చి, చింతపండు, బాదం పప్పు లాంటివి కూడా పెరుగు తోడుగా వాడొచ్చు, కానీ మన పెద్ద వాళ్ళు చెప్పిన చేసిన ఈ ఎండు మిరపకాయల పద్ధతి అత్యంత సులువైనది. చిట్కాలు అంటే అవసరానికి అద్భుతంగా పని చేస్తాయి.
Also Read: Jatadhara Movie Update: శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!.. పండగ చేసుకుంటున్న నిర్మాత