Jatadhara-Movie(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Jatadhara Movie Update: శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌!.. పండగ చేసుకుంటున్న నిర్మాత

Jatadhara Movie Update: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన బజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతోన్న ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

Read also-MLC Kavitha: కీలక నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత?.. ప్రకటన ఎప్పుడంటే?

‘ఖుదా గవా’, ‘మృత్యుదంద్’ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్ ‘జటాధర’ చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ గెలిచేస్తారని ప్రేరణ అరోరా అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘జటాధర’లోని శోభ అనే పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌కు అన్ని అవార్డులు వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. శోభ ఒక శక్తివంతమైన, సంక్లిష్టమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె తన నటనతో ఎంతో ఇంటెన్స్‌ను తీసుకు వచ్చి న్యాయం చేశారు. ఆమె ప్రేక్షకులకు పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది’ అని అన్నారు. ‘జటాధర’ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్, యాక్షన్, మిస్టరీల ప్రత్యేకమైన కథతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్, సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే శోభ పాత్రలో నటి శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జటాధర’ ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు

Read also-SSMB29 Kenya Shoot: ఆ క్రేజ్ ఏంటి భయ్యా.. ఖండాలు దాటిపోయింది.. నువ్వు దేవుడివి సామీ

టీజర్ విషయానికి వస్తే.. ‘జటాధర’ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోందనే విషయాన్ని టీజర్‌లోని ప్రతి షాట్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇదొక పౌరాణిక ఇతిహాసం అనే ఫీల్‌ని ఇస్తోంది. దురాశ వర్సెస్ త్యాగం, చెడు వర్సెస్ మానవత్వం అనే ఇతివృత్తాలతో ఈ సినిమా రూపొందుతుందనే విషయాన్ని టీజర్ తెలియజేస్తుంది. సోనాక్షి సిన్హా పాత్ర ‘దురాశ సృష్టించిన చీకటి’గా పరిచయం చేయబడితే.. సుధీర్ బాబు ‘త్యాగం నుంచి జన్మించినవాడు’గా పరిచయం చేయబడ్డారు. సోనాక్షి సిన్హా కత్తి పట్టుకుని రాజరికపు లుక్‌లో భయానకంగా కనిపిస్తే.. త్రిశూలంతో సుధీర్ బాబు ఒక శక్తివంతమైన పాత్రని చేసినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. సంస్కృత వచనంతో, అదిరిపోయే విజువల్స్‌తో ప్రారంభమైన టీజర్.. వెంటనే పౌరాణిక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. పురాతన శిథిలాలు, ఒక ఆలయం వలే ఉన్న గుహ, నిధి పెట్టెలు, లావాతో చుట్టుముట్టబడిన ఒక చెట్టు.. ఈ టీజర్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. ఇది దురాశ, దాని విధ్వంసక స్వభావం యొక్క ఇతివృత్తాన్ని హైలైట్ చేస్తుంది. మహామృత్యుంజయ మంత్రం వినిపిస్తూ.. హీరో ఎంట్రీ.. యాక్షన్ షాట్స్, ప్రధాన పాత్రధారులిద్దరూ భీకర యుద్ధంలో పాల్గొనడం వంటి సన్నివేశాలన్నీ గూజ్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం